twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR ఆస్కార్‌కు పంపకపోవడం దారుణం.. ఛెల్లో షో మూవీని ఎలా ఎంపిక చేస్తారు? ప్రశ్నించిన శంకర్

    |

    ప్రపంచంలోనే అత్యుత్తమ చిత్రాలకు పట్టం కట్టే ఆస్కార్ 2023 అవార్డు కోసం RRR చిత్రాన్ని ఎంపిక చేయకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. భారత దేశం తరఫున RRR, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలను కాదని... గుజరాత్‌కు చెందిన ఛెల్లో షో సినిమాను ఎంపిక చేయడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే RRR సినిమాను ఎంపిక చేయకపోవడంపై తెలుగు పరిశ్రమ నుంచి నిరసన గళాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వివాదంపై టాలీవుడ్ దర్శకుడు ఎన్ శంకర్ స్పందించారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

    ఆస్కార్ నిబంధన ఇదే..

    ఆస్కార్ నిబంధన ఇదే..

    అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేషన్‌కు ముఖ్యంగా అమెరికాలో లేదా ఇంగ్లీష్‌లో రూపొందించే చిత్రాలను పరిగణనలోకి తీసుకొంటారు. అయితే ఇతర దేశాల్లో రూపొంది.. అమెరికాలో రిలీజైన సినిమాలను కూడా నామినేషన్‌కు స్వీకరించే నిబంధన ఉంది. రెండో నిబంధన ప్రకారం RRR సినిమాను ఆస్కార్ బరిలో నిలిచే అధికారం ఉంది.

    దేశం తరఫున ఛెల్లో షో

    దేశం తరఫున ఛెల్లో షో

    అయితే ఆస్కార్ అవార్డుల కోసం ప్రతిపాదనలను పంపే అధికారం దేశంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. పలు విభాగాల్లో RRR చిత్ర యూనిట్ ఆస్కార్‌కు పంపాలని ప్రతిపాదనలు పంపింది. అయితే ఇంగ్లీష్‌లో రూపొందిన ఛెల్లో షో సినిమాను దేశం తరఫున పంపుతూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకొన్నది.

    ఛెల్లో షో గొప్ప సినిమా కాదు..

    ఛెల్లో షో గొప్ప సినిమా కాదు..

    గుజరాతీ చిత్రం 'ఛల్లో షో'ని ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా జ్యూరీ నామినేట్ చేసిందని వార్తలపై దర్శకుడు ఎన్ శంకర్ తీవ్రంగా స్పందించారు. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఛల్లో షో టీజర్ చూడటం జరిగింది. అలాంటి కంటెంట్ చిత్రాలు దక్షిణాదిలో చాలా వచ్చాయి. RRR కంటే గొప్ప సినిమా కాదనేది నా అభిప్రాయం అని శంకర్ అన్నారు.

    RRR మూవీని పంపకపోవడం ఆశ్చర్యంగా

    RRR మూవీని పంపకపోవడం ఆశ్చర్యంగా

    నేను కూడా ఇండియన్ ఆస్కార్ నామినేట్ కమిటీకి జ్యూరీ సభ్యునిగా, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి వైస్ చైర్మన్‌గా, గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ కమిటీకి జ్యూరీ మెంబర్‌గా పని చేశాను. ఆరుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో జ్యూరీ మెంబర్‌గా, ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ కమిటీ చైర్మెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. RRR సినిమాని జ్యూరీ పంపకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది అని అన్నారు.

    అత్యంత బాధాకరం అంటూ

    అత్యంత బాధాకరం అంటూ

    RRR మూవీలో దేశభక్తితో పాటు గొప్ప నిర్మాణ విలువలు, ఇండియన్ సినిమా ప్రతిష్టను కాపాడటానికి చిత్ర బృందం చేసిన కృషి మనందరికీ తెలిసిందే. గుజరాతీ చిత్రం 'ఛల్లో షో'ని ఏ కోణంలో నామినేట్ చేశారో తెలియదు. కానీ RRR చిత్రాన్ని పంపకపోవడం బాధకలిగించింది అని ఎన్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Sensational Director SS Rajamouli's RRR is out from the Oscar Nominations. In this occassion, Director N Shankar slams the decision of the Film federation of India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X