బిగ్ న్యూస్ .. జక్కన్న ఎప్పుడో చెప్పిన 'RRR' కి మరో వెర్షన్ ఎప్పుడు.. ఎందులో అంటే?
భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రాల్లో ఖచ్చితంగా ఉండే సినిమాల్లో మన తెలుగు సినిమాలే ఉండటం అనేది తెలుగు వారికి చాలా గర్వకారణం. అయితే తెలుగు సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది ఎవరైనా ఉన్నారు అంటే అది గ్లోబల్ దర్శకుడు జక్కన్న రాజమౌళి అనే అందరికీ తెలుసు. మగధీర నుంచి టాలీవుడ్ స్టాండర్డ్స్‌ని పెంచిన జక్కన్న అక్కడ నుంచే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన సినిమాలు వేరే లెవెల్లోకి వెళ్లాయి.
కాగా ఆ సినిమాల్లో బాహుబలి కి ఓ అధ్యాయం ఉండగా.. సెన్సేషనల్ మల్టీస్టారర్ చిత్రం "RRR" కూడా ఈ పరంపరలో ఒకటి. తెలుగులో అప్పటివరకు లేని బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ లతో జక్కన్న చేసిన ఈ చిత్రం బాహుబలి 2కి మించి బిగ్గెస్ట్ రీచ్ తెచ్చుకుంది. ఇలా వరల్డ్ వైడ్ గా RRR సినిమా ఓ రేంజ్ లో ఆదరణ అందుకొని ఆస్కార్ అవార్డు కూడా ఇండియాకి, తెలుగు నేలకి తీసుకొచ్చింది.

దీనితో ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా చాలా పేరు వచ్చింది. ఐతే ఎప్పుడో 2022లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఆ తర్వాత ఒక ఏడాదిన్నర పాటుగా ఆడియెన్స్ చర్చల్లో వినిపిస్తూనే ఉంది. కాగా ఇప్పుడు మళ్ళీ మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్ బయటకి వచ్చింది. లేటెస్ట్ గా బిగ్ అప్డేట్ ఇస్తూ RRR నుంచి ఒక కొత్త డాక్యు చిత్రాన్ని తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు.
రాజమౌళిపై ఓ ఇంటెన్స్ పోస్టర్ తో ఈ సినిమా వెనుక ఏం జరిగింది? అనే దానిపై ఒక మేకింగ్ వీడియో లాంటి దాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. RRR చిత్రం షూటింగ్ సమయంలోనే ప్రతీ సీన్ మెయిన్ లీడ్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కాకుండా తమ చిత్ర యూనిట్ తో చేసిన సీన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో నవ్వు తెప్పిస్తాయి అని తమ సినిమాకి పూర్తిగా మరో వెర్షన్ మంచి కామెడీగా ఉంటుంది అని జక్కన్న అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
దీనితో దానినే డాక్యు చిత్రంగా అనౌన్స్ చేశారు. సినిమా వెనుక ఏం జరిగింది? సన్నివేశాలు ఎలా తీశారు? అనే మేకింగ్ వీడియో ఒక డాక్యుమెంటరీ సినిమాగా తెరకెక్కిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ డాక్యు చిత్రాన్ని ఈ డిసెంబర్‌లో రిలీజ్‌కి తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. అయితే ఏ ఓటిటిలో వస్తుంది అనేది ఇంకా రివీల్ చేయలేదు కానీ దీనిని కూడా వరల్డ్ పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నే తీసుకుంటుంది అని టాక్ వినిపిస్తోంది.
కాగా రాజమౌళిపై రీసెంట్ గా ఒక డాక్యూమెంటరీని నెట్ ఫ్లిక్స్ మొన్నామధ్య తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు మళ్ళీ ఈ కొత్త డాక్యుమెంటరీని కూడా ఈ సంస్థనే తీసుకున్నట్టుగా వినిపిస్తుంది. నిజానికి RRR సినిమా నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన తర్వాతే భారీ రీచ్ వచ్చింది. అక్కడ నుంచి రాజమౌళి రిలేటెడ్ కంటెంట్ అంటే వారు కూడా చాలా ఆసక్తిగా కూడా ఉన్నారు. మరి దీనిని కూడా వారే తీసుకొని ఉండాలి.


Click it and Unblock the Notifications











