twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: హాలీవుడ్‌కు షాకిస్తూ మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న రాజమౌళి టీమ్.. న్యూ రికార్డ్

    |

    RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టిమచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు లభించింది. ఓటీటీ లో విడుదలైన తర్వాత కూడా ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఈ సినిమాకు మంత్రం ఫిదా అయ్యారు. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్ సైతం రాజమౌళి పనితీరుకు ప్రశంసలు కురిపించారు. తప్పకుండా ఈ సినిమా ఆస్కార్ రేస్ ఉంటుంది అని కూడా కొంతమంది సినీ ప్రముఖులు అంచనా వేశారు.

    ఇక సినిమాకు ఇతర దేశాలలో ప్రముఖ అవార్డులు కూడా దక్కుతున్నాయి. అలాగే ప్రముఖ ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా ఈ సినిమాకు గుర్తింపు లభించింది. ఇప్పటికే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మిడ్ సీజన్ ఫిలిం అవార్డ్స్ లలో బెస్ట్ పిక్చర్ లలో ఈ సినిమా రన్నర్ ఆఫ్ గా నిలిచింది. ఇంతకుముందు అమెరికన్ స్టార్ట్యూమ్ అవార్డ్స్ లో కూడా RRR సినిమాకు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం గా అవార్డు దక్కింది.

    RRR movie another prestigious award from hca critics

    ఇక బెస్ట్ ఆక్షన్ బెస్ట్ డైరెక్టర్ లో కూడా ఈ సినిమా నామినేట్ అవ్వడం విశేషం. ఇటీవల హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ లో కూడా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఈ సినిమా నామినేట్ అయింది. ఇక న్యూయార్క్ ఫిలిం సర్కిల్లో బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళికి అవార్డు దక్కడం విశేషం. అయితే రీసెంట్ గా RRR ఆర్ సినిమాకు మరొక అరుదైన అవార్డు దక్కింది. సినిమాకు పని చేసిన వారందరికీ ప్రశంసలు దక్కేలా హాలీవుడ్ క్రిటికల్ అసోసియేషన్ నుంచి గుర్తింపు లభించింది.

    RRR movie another prestigious award from hca critics

    యూఎస్ఏ కు చెందిన హెచ్ఏ క్రిటిక్స్ స్పాట్ లైట్ విన్నర్ గా RRR మూవీకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ని ఎంపిక చేశారు. ఈ అవార్డుతో సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీ సినీ ప్రముఖులను మరోసారి ఆకర్షించింది. ఇక ఇండియా నుంచి RRR సినిమాకు ఆస్కార్ బరిలో నిలుస్తుందని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు దేశ విదేశాల నుంచి ప్రముఖంగా వార్డులు దక్కుతూ ఉండడంతో తప్పకుండా ఈ సినిమాను మళ్ళీ ఆస్కార్ బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    English summary
    RRR movie another prestigious award from hca critics..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X