twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR మరో రికార్డు.. ఆ విషయంలో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సినిమా!

    |

    ప్రపంచ ప్రఖ్యాత 'బాహుబలి' దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈరోజు టి-సిరీస్ ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. ఎవరూ ఊహించని విధంగా టి-సిరీస్ ఆర్ఆర్ఆర్ అభిమానులకు ప్రత్యేక బహుమతి ఇచ్చింది. భారతదేశ ప్రజలే కాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ అతిపెద్ద యాక్షన్ డ్రామా చిత్రం 'ఆర్ఆర్ఆర్' యొక్క సంగీత హక్కులు పొందడం తమకు సంతోషంగా ఉందని టీ సిరీస్ సంస్థ వెల్లడించింది.

    అంటే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ యొక్క సంగీతానికి సంబంధించిన అన్ని హక్కులు టి-సిరీస్ అందుకున్నట్టయింది. అయితే ఈ విషయంలో కూడా ఆర్ఆర్ఆర్ రికార్డు కొట్టినట్టు అయింది. ఎలా అంటే గతంలో చివరిగా యష్ యొక్క కెజిఎఫ్ 2 ఆడియో హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. కన్నడ సూపర్ స్టార్ యష్ చిత్రం కె జి ఎఫ్ చాప్టర్ 2 యొక్క ఆడియో హక్కులు లహిరి మ్యూజిక్ మరియు టి-సిరీస్ లకు భారీ మొత్తానికి అమ్మినట్లు గతంలో ఈ సినిమా నిర్మాతలు వెల్లడించారు.

     RRR Movie audio rights sold for 25 crores a all-time record for south indian film

    ఈ సినిమా ఆడియో హక్కులు మేకర్స్ 7.2 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇది భారీ మొత్తం. అప్పటికి ఈ సినిమా సౌత్ మొత్తం మీద టాప్ లో ఉండేది. కానీ ఈరోజు ఆర్ఆర్ఆర్ దెబ్బకి ఆ సినిమాను దాటేసింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాని కూడా కేజీఎఫ్ ను కొనుకున్న రెండు సంస్థలు సంయుక్తంగా కొనుక్కున్నాయి.అది కూడా ఏకంగా 25 కోట్ల రూపాయలకి అని తెలుస్తోంది. ఇక స్వాతంత్రం కోసం పోరాటం చేసి వీర మరణం పొందిన తెలుగు వాళ్ళు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రల ఆధారంగా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    English summary
    According to latest reports, the music companys that bagged RRR audio rights have payed a hefty amount of 25 crores. which is all-time record for south indian film.Yes, Lahari Music has grabbed the audio rights of RRR for a record price. The audio rights including Telugu, Tamil, Kannada, and Malayalam. Hindi music rights is said to be owned by the other popular music company. Regarding audio rights, soon an official announcement is expected.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X