RRR Release Date: సంక్రాంతి బరిలోనే.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాకి పోటీగా!

సినిమాల విడుదల తేదీలపై ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా నిర్మాతల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది. ఎవరు ఏ సమయానికి వస్తే బాక్సాఫీస్ వద్ద క్లాష్ వస్తుందో అని కంగారు మొదలైంది. ఇక ముఖ్యంగా పెద్ద సినిమాలు ఎక్కువగా పండుగ సీజన్ ను ఫోకస్ చేయడంతో బడా హీరోల మధ్య లో బిగ్ ఫైట్ తప్పేలా లేదు. బాక్సాఫీస్ వద్ద ఎవరి మార్కెట్ ఎంత ఉన్నా కూడా ఈ పోటీ అనేది తప్పకుండా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది.

ఇక అందరి ఫోకస్ కూడా 2022 సంక్రాంతి పైనే ఉంది. ఎలాగైనా ఆ సమయంలోనే విడుదల చేయాలని టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోలు సిద్ధంగా ఉన్నారు. ఇక సమయంలోనే RRR కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్మాతలతో చర్చలు జరిపిన దర్శకుడు రాజమౌళి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది

ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది

పాన్ ఇండియా సినిమాలు మార్కెట్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దర్శకుడు రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా ఓపెనింగ్స్ తోనే సరికొత్త రికార్డులు మొదలవుతాయి. బాహుబలి అనంతరం చేస్తున్న RRR సినిమాపై కూడా అంచనాలు ఎప్పుడో ఆకాశాన్ని దాటేశాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ కోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది.

తొమ్మిది వందల కోట్లు

తొమ్మిది వందల కోట్లు

అసలైతే ఈ ఏడాది దసరా సమయంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వంటి బడా హీరోలు కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో తెలుగు ఇండస్ట్రీలో కూడా అన్ని వర్గాల ప్రేక్షకులలో అంచబల అయితే భారీగానే ఉన్నాయి. తప్పకుండా సినిమా పాన్ ఇండియా మార్కెట్ స్థాయిని కూడా పెంచుతుందని ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలతో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ లెక్క దాదాపు తొమ్మిది వందల కోట్లు దాటినట్లు సమాచారం.

సంక్రాంతి బరిలో

సంక్రాంతి బరిలో

అయితే ఈ సినిమా ఈజీగా అతి తక్కువ కాలంలోనే వెయ్యి కోట్ల వసూళ్లను అందుకునే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే RRR సినిమా విడుదల తేదీపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట్లో వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఇప్పుడు జనవరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న RRR సినిమా విడుదల చేయవచ్చని సమాచారం. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇస్తారని కథనాలు వెలువడుతున్నాయి.

భీమ్లా నాయక్ తో పోటీ

భీమ్లా నాయక్ తో పోటీ

సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయ్యాయి అయితే సంక్రాంతి బరిలో నిలవడం ఎంతవరకు సేఫ్ అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే అదే సమయంలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి వారు పోటీకి సిద్ధమయ్యారు. భీమ్లా నాయక్ జనవరి 12 న రాబోతున్న విషయం తెలిసిందే. ఇక అదే రోజు RRR వచ్చింది అంటే బాక్సాఫీస్ రికార్డులు ఊహించని విధంగా ఉంటాయి. ఒకవైపు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మరొకవైపు రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్ అంటే వాతావరణం ఈ తరహాలో ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు.

Recommended Video

NTR Buys Fancy Number For 17 Lakhs | Lamborghini Urus || Filmibeat Telugu
మహేష్, ప్రభాస్ తో కూడా పోటీ..?

మహేష్, ప్రభాస్ తో కూడా పోటీ..?

ఇక జనవరి 13న మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదల కాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఆ తర్వాత జనవరి 14వ తేదీన రెబల్ స్టార్ ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ కూడా భారీగా విడుదల కాబోతోంది. వీటితో పాటు మరొక ముఖ్యమైన మల్టీస్టారర్ F3 కూడా రావచ్చు అని సమాచారం. పోటీలో RRR సినిమా ఉంటే మిగతా సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎవరు ఎలాంటి వసూళ్లను అందుకుంటాతో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X