పరాయి గడ్డపై RRR సంచలన రికార్డు.. ఏకధాటిగా 21 నెలలు రన్.. ఏ దేశంలో తెలుసా?
ఇప్పుడు ప్రపంచ పటం దగ్గర భారతీయ సినిమా అలాగే తెలుగు సినిమా తాలూకా స్థానం ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఇలాంటి కీర్తిని సంపాదించడంలో కీలక పాత్ర వహించిన సినిమాల్లో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పేరే ముందుంటుంది. తాను తెరకెక్కించిన బాహుబలి 2, RRR సినిమాలు సంచలన విజయాలు సాధించి వరల్డ్ వైడ్ సినిమా దగ్గర భారీ పాపులారిటీ తెచ్చుకున్నాయి.
అయితే ఈ రెండిట్లో కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లు చేసిన ఈ RRR సినిమా రికార్డు వసూళ్లతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణని కూడా అందుకుంది. అయితే మాములుగా మన తెలుగు ఆడియెన్స్, హిందీ ఆడియెన్స్ సినిమా అంటే గట్టి లాంగ్ రన్ లు ఇస్తారు భారీ వసూళ్లు అందిస్తారు అనుకుంటారు.

అయితే ఇది నిజమే కాకపోతే ఇది ఒకప్పటి మాట. ఒకపుడు సినిమా పెద్ద హిట్ అయితే కొలమానం అది థియేటర్స్ లో ఎన్ని రోజులు రన్ అయ్యింది అనే దాని మీదే ఆధారపడి ఉండేది. కానీ అనూహ్యంగా ఇపుడు అంతా మారిపోయింది. కేవలం వసూళ్లు ఆధారంగా సినిమాల ఫలితాలు లెక్కిస్తున్నారు. ఇలాంటి డిజిటల్ వరల్డ్ లో కూడా ఓ సినిమా 50 లేదా 100 రోజులు రన్ అవ్వడం అనే గగనం గానే మిగిలిపోయింది.
కాగా ఇది మన దేశంలో పరిస్థితి అయితే మన సినిమాలే మన దగ్గర 50 రోజులు ఆడని సందర్భాలు కనిపిస్తుంటే పర దేశంలో మన దేశపు సినిమా అది కూడా తెలుగు సినిమా ఏకధాటిగా ఒక సంవత్సరం 9 నెలలు ఆడింది అంటే నమ్ముతారా? అవును ఇది నిజమే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్ దేశంలో ఏకంగా ఒక సంవత్సరం 9 నెలలు ఓ స్క్రీన్ లో సక్సెస్ ఫుల్ గా అది కూడా దాదాపు హౌస్ ఫుల్స్ తో రన్ అయ్యిందట.
జపాన్ లో సున్ సున్ అనే థియేటర్ సుమారు 70 ఏళ్ళుకి పైగా చరిత్ర కలిగింది కాగా అందులో RRR సినిమా విడుదల నాటి నుంచి ఏకంగా 21 నెలలు నాన్ స్టాప్ రన్ తో కంటిన్యూ అయ్యి సంచలన రికార్డు నమోదు చేసినట్టుగా తెలిసింది. కాగా జపాన్ లో తెలుగు సినిమాలు అది కూడా చరణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ కి భారీ క్రేజ్ ఉంది. అలా వెళ్లిన ఈ సినిమా ఇండియన్ సినిమా నుంచి ఏ సినిమా కూడా అందుకొని సెన్సేషనల్ రన్ అండ్ వసూళ్లు రాబట్టి దుమ్ము లేపింది.
ఇలా జపాన్ లో విడుదల అయ్యిన ఈ చిత్రం ఎన్నెన్నో సంచలన రికార్డులు అందుకుంది. అయితే మనోళ్లే సినిమా పిచ్చోళ్ళు అనుకుంటే జపాన్ ఆడియెన్స్ ఈ రేంజ్ లో ఆదరణ చూపించారు అంటే వాళ్ళని ఏమనాలో కూడా అర్ధం కావడం లేదని చెప్పాలి. అన్నట్టు ఆ థియేటర్ లో ఇదే RRR రన్ కి లాస్ట్ వీక్ అట. దీనితో సినిమా యూనిట్ కూడా కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతూ పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











