Just In
- 27 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RRR: అలియా స్టాఫ్ కోసం రోజుకు లక్ష రూపాయలా.. మొత్తం ఎంత మంది అంటే..?
ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ మిడియా కూడా ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మ్యాటర్ కొంచెం లీకైనా కూడా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇక హీరోయిన్ అలియా భట్ అలా షూటింగ్ స్పాట్ కు వచ్చిందో లేదో అందరికి షాకిచ్చే న్యూస్ ఒకటి బయటకు లీక్ అయ్యింది. ఆమె స్టాఫ్ కోసమే RRR నిర్మాత ఒక స్పెషల్ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి..
హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇదే. దాదాపు 450కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మిగతా తారాగణం కూడా చాలా కీలకమనే చెప్పాలి. పాన్ ఇండియా సినిమా కాబట్టి మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని రాజమౌళి ప్రతి భాషకు సంబంధించిన నటీనటులను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక అలియా భట్ రామ్ చరణ్ కు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

అలియాను ఎంచుకోవడానికి కారణం
అల్లూరి సీతారామరాజు మరదలు సీత పాత్రలో నటించనున్న అలియా భట్ ఈ రోజు హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ను కలుసుకుంది. ఆమెను ఎంచుకోవడానికి ప్రధానం కారణం ఆమెకు బాలీవుడ్ లో ఉన్న సక్సెస్ రేట్. అలాగే టాలెంటెడ్ యాక్టర్స్ కాబట్టి సీత పాత్రకు సరైన న్యాయం చేయగలదని దర్శకుడు ఆమెపై నమ్మకంతో ఉన్నాడు. ఇక రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తున్నారట.

రోజుకు ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే..
సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ కాబట్టి కొన్ని రోజుల డేట్స్ మాత్రమే తీసుకున్నారట. వీలైనంత వరకు ఒక షెడ్యూల్ లోనే అలియా భట్ సీన్స్ అన్నిటినీ కూడా ఫినిష్ చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నాడు దర్శకుడు. ఇక ఆమె రెమ్యునరేషన్ రోజుకు 50లక్షలని తెలుస్తోంది. నిజానికి ఇది చాలా ఎక్కువనే టాక్ వస్తోంది.

స్టాఫ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా
అలియా భట్ రెమ్యునరేషన్ సంగతి పక్కనపెడితే ఆమె స్టాఫ్ ఫీజులు ప్రతి ఒక్కరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ముంబై నుంచి ఆమె వెంట 10మంది సిబ్బంది హైదరాబాద్ కు వచ్చారు. పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్, పర్సనల్ అసిస్టెంట్, హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్, అలాగే మేనేజర్ తో పాటు పర్సనల్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇక సెక్యూరిటి కోసం నలుగురు బౌన్సర్స్ కూడా ఉన్నారట.

మొత్తం కలిపి ఎంతవుతోందంటే..
ఈ విధంగా అలియా భట్ 10 మందిని వెంటేసుకొని రావడంతో వారికి తిండి, అలాగే స్టార్ హోటల్స్ లో రూమ్స్ బుక్ చేయడానికి రోజుకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందట. ఆమె రెమ్యునరేషన్ తో పాటు 10మంది సిబ్బంది ఫీజులు ఖర్చులు కలుపుకొని రోజుకు 60లక్షలు అవుతోంది. ఇక వారం ఎక్కువైనా ఆ లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మరిఈ రేంజ్ లో ఖర్చు చేయిస్తున్న అలియా RRR రిజల్ట్ కోసం ఎంతవరకు కష్టపడుతుందో చూడాలి.