కొమురం భీమ్ కోసం సిద్దమైన రామారాజు.. టైమ్ ఫిక్స్ చేసుకున్న RRR టీమ్: 5భాషల్లో టీజర్

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ గా రూపొందుతున్న RRR కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి అనంతరం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అన్ని భాషల వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన డేట్ టైమ్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు.

కొమురం బీమ్ టీజర్ రెడీ

కొమురం బీమ్ టీజర్ రెడీ

జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొమురం భీమ్ టీజర్ ని రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేయనున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చిన RRR టీమ్ గత కొన్ని రోజులుగా షూటింగ్ తో బిజీగా గడిపింది. ఇక మొత్తానికి అనుకున్న సమయానికి రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు రావాల్సిన ఈ టీజర్ దాదాపు 5 నెలల తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 22న రిలీజ్ చేయనున్నారు.

5భాషల్లో 11గంటలకు..

5భాషల్లో 11గంటలకు..

అయితే ఈ టీజర్ ని 5భాషల్లో విడుదల చేస్తున్నారు. ఉదయం 11గంటలకు హిందీలో అజయ్ దేవగన్, తెలుగులో డివివి మూవీస్, తమిళ్ లో జూనియర్ ఎన్టీఆర్, మలయాళంలో రామ్ చరణ్, కన్నడలో వారాహి మూవీస్ యూ ట్యూబ్స్ ఛానెల్స్ లో టీజర్ ని విడుదల చేయనున్నారు. సినిమాకు ప్రమోషన్స్ అవసరం లేకపోయినా కూడా చిత్ర యూనిట్ మాత్రం ఆ విషయంలో లైట్ తీసుకోకుండా బ్యాక్ గ్రౌండ్ ప్లాన్ గట్టిగానే వేసినట్లు తెలుస్తోంది.

ఆ పనులన్నీ పూర్తయినట్లే..

ఆ పనులన్నీ పూర్తయినట్లే..

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు టీజర్ ని మార్చ్ 27న ఆయన పుట్టిన రోజున విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే20న జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఇక మొత్తానికి ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి మొదట జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ ని షూట్ చేశారు. టీజర్ పనులన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది.

Recommended Video

RRR Pre Release Business For OTT, Satellite Closes At Record Price | Filmibeat Telugu
సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

పాతబడిన సెట్స్ ని మళ్ళీ కొత్తగా సెట్ చేసుకున్న చిత్ర యూనిట్ చాలా తొందరగానే టీజర్ ని రెడీ చేసింది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ఏ మాత్రం బ్రేకులు వేయవద్దని అనుకుంటున్నారు. వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ ని పూర్తి చేసి రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నారు. షూటింగ్ పూర్తయిన తరువాతనే రిలీక్ డేట్ పై ఒక ప్లాన్ వేసుకొనున్నారట. వచ్చే సమ్మర్ లో కూడా కుదరదని తెలుస్తోంది. మరి రాజమౌళి సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తారో తెలియాలి అంటే షూటింగ్ అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X