RRR బ్రేకింగ్ అప్డేట్: అసలైన యుద్ధ మొదలైంది.. చేతులు కలిపిన భీమ్, రామరాజు

టాలీవుడ్ బిగెస్ట్ మల్టీస్టారర్ RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగా నందమూరి హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ వచ్చింది. దర్శకుడు రాజమౌళి సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. ఇక అసలైన యుద్ధం కూడా ఇప్పుడే మొదలైనట్లు తెలుస్తోంది.

PICS: ఇండియన్ కపుల్స్.. వైరల్ ఫోటోషూట్

మధ్యమధ్యలో బ్రేకులు పడుతున్నప్పటికి..

మధ్యమధ్యలో బ్రేకులు పడుతున్నప్పటికి..

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్స్ ను రిలీజ్ చేయగా యూ ట్యూబ్ లో అవి సెన్సేషన్ ను క్రియేట్ చేశాయి. లాక్ డౌన్ తరువాత మొదలైన షూటింగ్ కు మధ్యమధ్యలో బ్రేకులు పడుతున్నప్పటికి దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం నిరాశ చెందకుండా అదే ఫ్లోలో షూటింగ్ ను కొనసాగిస్తున్నారు.

క్లైమాక్స్ మొదలైంది

క్లైమాక్స్ మొదలైంది

ఇటీవల రామ్ చరణ్ కోవిడ్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో ఇద్దరు హీరోల మధ్య బలమైన క్లైమాక్స్ సీన్స్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలో ఇదే అసలైన ఎపిసోడ్ కావడంతో జక్కన్న ఫుల్ ఫోకస్ పెట్టి ప్లాన్ చేస్తున్నారు.

అనుకుంటున్నది నెరవేర్చడానికి

అనుకుంటున్నది నెరవేర్చడానికి

పవర్ఫుల్ భీమ్ అలాగే హై వోల్టేజ్ లాంటి రామరాజు కలిసి వారు సాధించాలని అనుకుంటున్నది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక విదంగా సినిమాకు ఇదే అసలైన యుద్ధం అని చెప్పవచ్చు. ఈ యుద్ధం లాంటి షూటింగ్ విజయవంతంగా పూర్తి చేస్తే షూటింగ్ పార్ట్ హ్యాపీ నోట్ తో పూర్తయినట్లే.

Recommended Video

RRR Pre Release Business For OTT, Satellite Closes At Record Price | Filmibeat Telugu
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

దీని తరువాత జక్కన్న పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అవుతాడు. అయితే RRR టీమ్ చేసిన ఆ ట్వీట్ పై హీరో జూనియర్ ఎన్టీఆర్ సూపర్ ఎక్సైటెడ్ అంటూ ట్వీట్ చేయగా రామ్ చరణ్ హైలీ ఛార్జిడ్ అంటూ పోస్ట్ చేశారు. చూస్తుంటే ఇద్దరు ఈ క్లైమాక్స్ సీన్స్ కోసం చాలా పవర్ఫుల్ గా రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X