twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్‌కు ముహూర్థం ఖరారు

    |

    బాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి #ఆర్ఆర్ఆర్ పేరుతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో భారీ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయం ఇన్నాళ్లు సస్పెన్స్‌గా ఉంచిన చిత్ర బృందం తాజాగా ముహూర్థం ఖరారు చేశారు.

    2018 నవంబర్ 11, ఉదయం 11గంటలకు ఈ మూవీ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డివివి ఎంటర్టెన్మెంట్స్ సంస్థ అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేసింది. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

    11:11:11

    సినిమా లాంచింగ్ డేట్ కూడా వినూత్నంగా ప్రకటించారు. లైవ్ వీడియో ద్వారా లాచింగ్ డేట్ రివీల్ చేశారు. ఈ ప్రకటనతో ‘ఆర్ఆర్ఆర్' మూవీ లాంచింగ్ డేట్ విషయంలో నెలకొన్న అయోమయం తొలగినట్లయింది.

    రూ. 300 కోట్ల భారీ బడ్జెట్

    రూ. 300 కోట్ల భారీ బడ్జెట్

    రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బడ్జెట్ ఈ రేంజిలో ఉందంటే సినిమా ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాను మించిపోయేలా ఈ చిత్రం ఉండటం ఖాయం.

    రామ్ చరణ్, ఎన్టీఆర్

    రామ్ చరణ్, ఎన్టీఆర్

    ఈ సినిమా బ్యాక్‌ డ్రాప్ విషయానికొస్తే... 1920 నాటి కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే పోరాటం నేపథ్యంలో సాగుతుందని టాక్. బ్రిటిష్ సంపదను కొల్లగొట్టే దొంగ పాత్రలో ఎన్టీఆర్, బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసే పోలీస్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని టాక్.

    ముగ్గురు హీరోయిన్లు?

    ముగ్గురు హీరోయిన్లు?

    ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. గండిపేట ప్రాంతంలో సెట్స్ వేస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ ఇక్కడే జరుగుతుందని తెలుస్తోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని టాక్

    English summary
    Rajamouli's RRR movie will be launched on November 11 at 11 am. It is rumoured that Jr NTR will appear as a thief, while Ram Charan essays the role of as a cop, who works for the Britishers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X