twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR ఆస్కార్ ఆశలు సజీవం.. నామినేట్ చేయాలని డిమాండ్.. ఇలా చేస్తే ఎంట్రీ ఖాయం!

    |

    భారత్ తరపున ఆస్కార్ అవార్డుల పోటీకి అధికారిక ఎంట్రీగా గుజరాతీ చిత్రం ఛెల్లో షో సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ప్రకటించడంపై సినీ అభిమానుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజమౌళి దర్వకత్వం వహించిన RRR మూవీ ఆస్కార్ 2023 నామినేషన్‌కు ఎంపికవుతుందని భావించిన సినీ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. ఛెల్లో షో సినిమా ఇప్పటికే నామినేషన్‌ను సాధించినప్పటికీ RRR ఆస్కార్ నామినేషన్ సాధించే పోటీలో ఉందనే వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. RRR ఎలా నామినేషన్ సాధించే అవకాశం ఉందంటే?

     అమెరికాలో తీసిన చిత్రాలకు, ఇంగ్లీష్ చిత్రాలకు..

    అమెరికాలో తీసిన చిత్రాలకు, ఇంగ్లీష్ చిత్రాలకు..


    అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేషన్‌కు ముఖ్యంగా అమెరికాలో లేదా ఇంగ్లీష్‌లో రూపొందించే చిత్రాలను పరిగణనలోకి తీసుకొంటారు. అయితే ఇతర దేశాల్లో రూపొంది.. అమెరికాలో రిలీజైన సినిమాలను కూడా నామినేషన్‌కు స్వీకరించే నిబంధన ఉంది. ఈ క్యాటగిరిలో వివిధ దేశాల నుంచి ఉత్తమ చిత్రాలను నామినేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోమని కోరుతున్నారు. అయితే తమ దేశం తరఫున నామినేషన్‌ పంపే బాధ్యతను యూకేలో బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్, ఇండియాలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు.

     ఇండియా జోక్యం లేకుండా ఆస్కార్‌కు వెళ్లేందుకు

    ఇండియా జోక్యం లేకుండా ఆస్కార్‌కు వెళ్లేందుకు


    అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జోక్యం లేకుండా నేరుగా కూడా ఆస్కార్ అవార్డుకు నామినేషన్ కోసం పంపే వెసులుబాటు కూడా ఉంది. 2005లో దీపా మెహతా రూపొందించిన వాటర్ సినిమా కెనడా దేశపు అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ నామినేషన్‌ను సాధించింది. అయితే ఈ సినిమాను జాన్ అబ్రహం, లీసారే కెనడా దేశంలో నిర్మించడంతో ఇది సాధ్యపడింది. దాంతో RRR ఏ క్యాటగిరీలోను నామినేషన్ సాధించే అవకాశమే లేకుండా పోయింది.

    మిగితా క్యాటగిరీలో నామినేట్ చేయాలంటూ

    మిగితా క్యాటగిరీలో నామినేట్ చేయాలంటూ


    అయితే ఇలాంటి పరిస్థితుల్లో RRR మూవీకి ఆస్కార్ సాధించే అవకాశాలు, ఆశలు ఇంకా మిగిలి ఉన్నాయి. దేశం తరఫున అధికారిక ఎంట్రీ కాకుండా.. మరో క్యాటగిరీలో RRR అర్హత సాధించే అవకాశం ఉంది. గతంలో క్రోషింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, పారాసైట్, లాంటి చిత్రాలు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్యాటగిరీలో కాకుండా ఇతర క్యాటగిరీలో నామినేషన్ సాధించాయి. దాంతో RRR కూడా అవకాశాలు మిగిలే ఉన్నాయి అని సినీ నిపుణులు తెలియజేస్తున్నారు.

     అమెరికాలో అపూర్వ ఆదరణ

    అమెరికాలో అపూర్వ ఆదరణ


    అమెరికాలో RRR చిత్రానికి అపూర్వ ఆదరణ లభించింది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తున్నది. డానీ డీవిటో, ఎంసీయూ డైరెక్టర్స్, మార్వెల్ కామిక్ బుక్ రైటర్స్, హానెస్ట్ ట్రైలర్స్ లాంటి హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలకు నోచుకొన్నది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు దక్కని సాంస్కృతిక ఆదరణ RRR అందుకొన్నది. కాబట్టి ఈ సినిమాకు ఇంకా ఆస్కార్ నామినేషన్ సాధించే అవకాశాలు సజీవంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని సినీ పండితులు వెల్లడిస్తున్నారు.

    ప్రపంచ అభిమానుల నుంచి డిమాండ్

    ప్రపంచ అభిమానుల నుంచి డిమాండ్


    RRR సినిమాకు ఆస్కార్ నామినేషన్ దక్కేలా అమెరికాలోని వేరియెన్స్ ఫిల్మ్స్ డిస్టిబ్యూటర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రానున్న రోజుల్లో ఆస్కార్ 2023 వేడుకలో ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. RRR చిత్రం భాషా భేదాలను అధిగమించినందున ఈ సినిమాను అన్ని క్యాటగిరీలో నామినేషన్స్‌‌కు పరిగణనలోకి తీసుకోవాలని ఆస్కార్ నిర్వాహకులను వేరియెన్స్ ఫిల్మ్స్ డైలాన్ మార్చెట్టి డిమాండ్ చేస్తున్నారు.

    English summary
    Sensational Director SS Rajamouli's RRR is out from the Oscar Nominations. But Stil It has way to nominate in Academy awards. Here is the reasons.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X