RRR ఓటీటీ ప్లాన్.. జనవరి 7వ తేదీన అలా జరిగితే.. అదే పెద్ద రిస్క్?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రేజ్ అందుకుంటున్న సినిమాల్లో RRR టాప్ లిస్టులో ఉందనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా మొదటి షోను చూడాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా జనవరి 7వ తేదీ లేదా మరో రెండు మూడు రోజుల తర్వాత OTT లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతకు మించిన విజయాన్ని
డి.వి.వి.దానయ్య నిర్మాతగా దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి రెండేళ్ల పాటు కష్టపడి తెరపైకి తీసుకు వస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ఫ్యాన్ ఇండియా మార్కెట్ ని మరో స్థాయికి తీసుకు వెళుతుందని కూడా అందరూ నమ్ముతున్నారు. బాహుబలి సినిమా తో ఇప్పటికే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి ఈ సినిమాతో అంతకు మించిన విజయాన్ని అందుకుంటారు అని అనిపిస్తోంది.

భారీ స్థాయిలో విడుదల
సినిమాను జనవరి 7వ తేదీన విడుదల చేయడానికి దాదాపు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు. కేవలం భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఒక విధంగా ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా విడుదల కానీ స్థాయిలో RRR సినిమాను అత్యధిక స్క్రీన్లలో విడుదల చేయనున్నారు.

ఒమిక్రాన్ భయం..
అయితే RRR సినిమా లో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియెంట్ వైరస్ కాస్త భయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీ లో దాదాపు అన్ని ఏరియాల్లో కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో టికెట్ల సమస్య ఉన్నప్పటికీ త్వరలోనే ఆ విషయంలో సానుకూల స్పందన వస్తుందని నమ్మకంతో ఉన్నారు.

50% ఆక్యుపెన్సీతోనే
అయితే చిత్ర యూనిట్ సభ్యులకు మాత్రం నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఇంకా అనుకున్నంత స్థాయిలో నమ్మకం కుదరడం లేదు. సినిమా అక్కడే ఎక్కువ స్థాయిలో లాభాలు రాబట్టాల్సి ఉంది. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో ఇంకా పూర్తిస్థాయిలో టీబీయేటర్లు ఓపెన్ అవ్వలేదు. కరోనా తీవ్రత పెరుగుతూ ఉండడంతో ఆ రాష్ట్రాల్లో 50% ఆక్యుపెన్సీతోనే థియేటర్లను నడిపిస్తున్నారు.

ఓటీటీ ద్వారా పే పర్ వ్యూ
అయితే ఈ సమస్య కారణంగా సినిమాకు ఓపెనింగ్స్ రావడం కష్టంగానే ఉంటుంది. కాబట్టే ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఓటీటీ ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో సినిమాను విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చర్చల్లోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ అలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా అందరిలో మిగిలి ఉన్నట్లు సమాచారం.
Recommended Video

అలా చేస్తే...ప్రమాదమే..
కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం ఆ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే థియేటర్స్ లో విడుదల చేయాలని, ఇలాంటి సినిమాను స్క్రీన్ పై చూస్తేనే మరొకసారి ఆడియన్స్ వచ్చి చూస్తారు అని కూడా నమ్మకంతో ఉన్నారట. ఒక విధంగా ఓటీటీ లో విడుదల చేస్తే మాత్రం పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా వెబ్ కంటెంట్ లో విడుదల అయినా సరే ఈజీగా పైరసీ చేస్తూన్నారు. టెలిగ్రామ్ వంటి యాప్ లలో ఒక్క క్లిక్ తో డౌన్లోడ్ చేసుకునేలా ఆప్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మిగతా రాష్ట్రాల్లో పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేస్తే మిగతా రాష్ట్రాల్లో కూడా పైరసీ ఈజీగా పాకేస్తుంది. అందుకే రాజమౌళి ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











