RRR, ram charan, ss rajamouli, ఎస్ఎస్.రాజమౌళి, టాలీవుడ్, రామ్ చరణ్

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ నార్త్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా RRR మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించిన ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి అంతకుమించి అనేలా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిగ్గెస్ట్ ఈవెంట్ కు ప్లాన్ సిద్ధమైంది. ఆ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్మాత దానయ్య ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేసేశారు. ఇక ఎప్పుడు ఎక్కడ జరగబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

బాహుబలి సినిమాలతో ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడిగా గుర్తింపు అందుకున్న రాజమౌళి ఈసారి బాక్సాఫీస్ వద్ద అంతకు మించి అనేలా సునామీ సృష్టించడానికి RRR సినిమాతో వస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని చిత్ర యూనిట్ సభ్యులు నిత్యం ఏదో ఒక ఇంటర్వ్యూతో ఆకట్టుకుంటూనే ఉన్నారు. కేవలం తెలుగులోనే కాకుండా భాషకు తగ్గట్టుగా ప్రతీ ఇండస్ట్రీలో ఇంటర్వ్యూలు ఇస్తూ అక్కడి జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందీలో కూడా మరోసారి గట్టిగానే ప్రమోషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

RRR movie Pre Release Event on 19th March in Chikkaballapura Karnataka

తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీలో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారు అనే విషయంలో గత రెండు మూడు రోజులుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. నిర్మాత డివివి.దానయ్య ముందుగా కర్ణాటకలో ఈవెంట్ ను నిర్వహించేందుకు భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు. ఆదివారం నుంచే అందుకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. వేడుకకు సంబంధించిన అన్ని విషయాలను కూడా రాజమౌళి తనయుడు కార్తికేయ దగ్గరుండి చూసుకుంటున్నాడు.

ఇక మార్చి 19వ తేదీన కర్ణాటక లోని చిక్కబల్లాపురాలో RRR భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ఇక వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు ఎలా మాట్లాడతారు అనేది అభిమానుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. భారీ స్థాయిలో జనాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సెక్యూరిటీ కూడా భారీగానే పెట్టనున్నారు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఇప్పటికే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా 900కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

అసలైతే RRR సినిమాను మొదట 400కోట్ల నుంచి 450 కోట్ల మధ్యలో తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ ఆ తరువాత ఒక్కసారిగా బడ్జెట్ పెరిగిపోయింది. ఇక ప్రొడక్షన్ కాస్ట్ టోటల్ గా 550కోట్లు అయినట్లు దర్శకుడు రాజమౌళి ఇటీవల వివరణ ఇచ్చారు. అంటే సినిమా ఏ స్థాయిలో విజువల్ ట్రీట్ ఇవ్వబోతుందో ముందే ఉహీంచవచ్చు. ఇక సినిమాను వరల్డ్ వైడ్ గా మార్చి 25వ తేదీన విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X