ఒకరోజు ముందుగానే RRR ప్రీమియర్ షోలు.. మొదటి షో పడేది ఎప్పుడంటే?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం RRR మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా మెగా నందమూరి అభిమానులను ఎంతగానో ఊరిస్తున్న ఈ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలపై కూడా ప్రస్తుతం ఒక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది.

కేవలం తెలుగులోనే కాకుండా..
దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా చాలామంది ప్రేక్షకులు మొదటిరోజు మొదటి సారి చూడాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు గా నటించగా కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.

ఆ రూట్లో కూడా మంచి బిజినెస్
అయితే ఎలాంటి సినిమా విడుదలైన కూడా ప్రిమియర్ షోలో అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారాయి ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే మొదటిరోజు మొదటి ఆట చూడాల్సిందే. ఇక హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు స్పెషల్ గా ఫాన్స్ షోలు అని ప్రత్యేకంగా థియేటర్లలో వేసేవారు. ఇక ఇప్పుడు అవి ప్రీమియర్ షోలుగా మారి భారీ స్థాయిలో బిజినెస్ చేయడం మొదలుపెట్టాయి.

ఒకరోజు ముందుగానే..
దేశంలోనే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన టువంటి RRR సినిమా ప్రీమియర్ షోలపై, ఫ్యాన్స్ షో లపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అందరికంటే ముందుగా చూడాలని ఆసక్తితో ప్రేక్షకులు ఎంతవరకైనా ఖర్చు చేస్తారని కూడా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు బాగా తెలుసు. ఇక రీలీజ్ కంటే ఒకరోజు ముందుగానే దేశమంతా ప్రీమియర్ షోలకు అనుమతి దొరికినట్లు సమాచారం.

సాయంత్రం 6 గంటల నుంచి..
త్రిబుల్ ఆర్ సినిమా మొదటి ప్రీమియర్ షోలు జనవరి 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఆ రోజు సాయంత్రం నుంచి కంటిన్యూగా కొన్ని షోలను ప్రదర్శిస్తారని తెలుస్తోంది. సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

అడ్వాన్స్ బూకింగ్స్ తో రికార్డులు
ఇప్పటికే అమెరికాలో కూడా ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వన్ మిలియన్ డాలర్స్ రావడం విశేషం. గతంలో ఇండియా నుంచి ఏ సినిమాకు కూడా ఆ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ రాలేవు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని ఈ లెక్కతో చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇక ప్రీమియర్ షోల టికెట్ల రేట్లను ఎలా కేటాయిస్తారు చూడాలి.


Click it and Unblock the Notifications











