RRR బ్రేకింగ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఫిక్స్.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఇండియన్ బిగెస్ట్ మల్టీస్టారర్ RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగా నందమూరి హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ వచ్చింది. గుర్రంపై చరణ్, బైక్ పై తారక్ ఫోర్స్ గా వెళుతున్న ఫొటోను వదిలారు. దర్శకుడు రాజమౌళి సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. ఇక అసలైన యుద్ధం కూడా ఇప్పుడే మొదలైనట్లు తెలుస్తోంది. అలాగే రిలీజ్ డేట్ పై కూడా ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చేశారు.

Recommended Video

RRR : Ram Charan, Jr NTR's Film To Release On This Date | Oneindia Telugu
రిలీజ్ డేట్ ఫిక్స్

రిలీజ్ డేట్ ఫిక్స్

అక్టోబర్ 13న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఫైర్ అండ్ వాటర్ కలిస్తే ఫోర్స్ మామూలుగా ఉండదు అనేలా ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. నెవర్ బిఫోర్ అనేలా అనుభూతి పొందడం పక్కా అని చెబుతున్నారు. ఇక ఈ డేట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే అని గత వారం నుంచి వస్తున్న రూమర్స్ కు ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది.

మధ్యమధ్యలో బ్రేకులు పడుతున్నప్పటికి..

మధ్యమధ్యలో బ్రేకులు పడుతున్నప్పటికి..

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్స్ ను రిలీజ్ చేయగా యూ ట్యూబ్ లో అవి సెన్సేషన్ ను క్రియేట్ చేశాయి. లాక్ డౌన్ తరువాత మొదలైన షూటింగ్ కు మధ్యమధ్యలో బ్రేకులు పడుతున్నప్పటికి దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం నిరాశ చెందకుండా అదే ఫ్లోలో షూటింగ్ ను కొనసాగిస్తున్నారు.

క్లైమాక్స్ మొదలైంది

క్లైమాక్స్ మొదలైంది

ఇటీవల రామ్ చరణ్ కోవిడ్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో ఇద్దరు హీరోల మధ్య బలమైన క్లైమాక్స్ సీన్స్ ను మొదలు పెట్టినట్లు ఇటీవల వివరణ ఇచ్చారు. సినిమాలో ఇదే అసలైన ఎపిసోడ్ కావడంతో జక్కన్న ఫుల్ ఫోకస్ పెట్టి ప్లాన్ చేస్తున్నారు.

అనుకుంటున్నది నెరవేర్చడానికి

అనుకుంటున్నది నెరవేర్చడానికి

పవర్ఫుల్ భీమ్ అలాగే హై వోల్టేజ్ లాంటి రామరాజు కలిసి వారు సాధించాలని అనుకుంటున్నది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అంటూ చిత్ర యూనిట్ మొన్న ట్వీట్ చేయగా అది ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక విదంగా సినిమాకు ఇదే అసలైన యుద్ధం అని చెప్పవచ్చు. ఈ యుద్ధం లాంటి షూటింగ్ విజయవంతంగా పూర్తి చేస్తే షూటింగ్ పార్ట్ హ్యాపీ నోట్ తో పూర్తయినట్లే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X