RRRపై ఫోకస్ పెట్టిన 2.ఓ నిర్మాతలు.. రాజమౌళి టీమ్ కు భారీ ఆఫర్
పాన్ ఇండియా మూవీ RRR సినిమా కోసం మెగా, నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు తారా స్థాయికి పెరుగుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి కంటే హై రేంజ్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమా బిజినెస్ కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

బిజినెస్ డీల్స్ క్లోజ్ అయినట్లే..
సినిమా మొదటి రోజే ఈజీగా వందకోట్లను రాబట్టగలదని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమాను ఇదే ఏడాది అక్టోబర్ 13న గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా చాలా వరకు క్లోజ్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన ఏరియాల్లో భారీ ధరకు సినిమా అమ్ముడైనట్లు సమాచారం.

బిజినెస్ లో 2.ఓ నిర్మాతలు
ఇక RRR సినిమా బిజినెస్ లో కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ లైకా కూడా భాగం కానుంది. సినిమా తమిళ హక్కులకు సంబంధించిన ధరపై చాలా రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. రిలీజ్ డేట్ ఎప్పుడైతే ఎనౌన్స్ చేశారో మిగతా భాషల్లో కూడా సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక సినిమా తమిళ రైట్స్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేయగా చివరికి 2 పాయింట్ ఓ నిర్మాతలకు దక్కింది.

తమిళ థియేట్రికల్ రైట్స్.. ఎంతంటే..
RRR తమిళ థియేట్రికల్ రైట్స్ 50కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు మొదట్లో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా లైకా ప్రొడక్షన్ వాళ్ళు 42కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది బెస్ట్ బిజినెస్ డీల్ అని చెప్పవచ్చు. ఇక తమిళ్ లో బాహుబలి కంటే హై రేంజ్ లో RRR సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

టీజర్ రాబోయేది అప్పుడే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి మెగా హీరోలు కలిసి మొదటిసారి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా కాబట్టి అంచనాలు రోజురోజుకు మరింత ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టీజర్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అయితే టీజర్ ను సమ్మర్ మిడ్ లో లేదా ఆగస్ట్ లో రిలీజ్ చేయవచ్చని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











