For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అసలు పని ముగించుకున్న జక్కన్న టీమ్.. అందరు దాని కోసమే వెయిటింగ్!

  |

  బాహుబలి సినిమాతో నేషనల్ లెవెల్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి ఆ సినిమా అనంతరం ఎలాంటి సినిమాతో వస్తాడా అని అన్ని బాధల్లోని సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా అంతకుమించి అనేలా జక్కన్న బిగ్గెస్ట్ మల్టిస్టారర్ తో మరోసారి మార్కెట్లోకి దిగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ మూవీ కోసం ఇరు వర్గాల అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే మొత్తానికి పూర్తి చేసుకున్నారు. ఇటీవల ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ కోసం ఉక్రెయిన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. మొత్తానికి అందరూ కలిసి సరదాగా ఆ షూటింగ్ ని పూర్తి చేసేశారు.

  ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తప్పకుండా సినిమాతో ఇద్దరు హీరోలు కూడా బాక్సాఫీస్ మార్కెట్ స్థాయిని మరో లెవెల్ కు పెంచుకుంటారని క్లారిటీ అయితే వచ్చేస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ముందుగా అనుకున్నట్లుగానే అక్టోబర్ 13న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ థియేటర్ల టికెట్ రేట్ల సమస్య కూడా ఎటు తెలియని పరిస్థితిలో ఉంది. అందుకే సినిమా తో రిస్క్ చేయడం అంత సేఫ్ కాదని మరో విడుదల తేదీ ఫిక్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు.

  Indian biggest pan india movie RRR team wraps up Ukraine schedule,

  అయితే డైరెక్ట్ గా పోస్టర్ తో కాకుండా అందరికీ అర్థమయ్యేలా ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇవ్వాలని రాజమౌళి టీమ్ ఆలోచిస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత దానయ్యతో పాటు హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతున్నారు. పరిస్థితుల గురించి వివరణ ఇస్తూ జనాలకు అర్థం అయ్యేలా చెప్పాలి అనుకుంటున్నారు. ఇక RRR వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చని తెలుస్తోంది. అసలైతే సంక్రాంతి కి రావాలని అనుకున్నారు. కానీ ముందుగానే అగ్రహీరోలు ఆ ఫెస్టివల్ ను బుక్ చేసుకున్నారు. ప్రభాస్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సినిమాలు పొంగల్ కు వస్తుండటంతో రిస్క్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. RRR సినిమాకు పెద్ద సినిమాలతో పోటీ ఉండకుండా ఉండాలని దర్శకుడు రాజమౌళి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఎలాంటి పోటీలో రిలీజ్ చేయవద్దని అనుకుంటున్నారు. అందుకే సినిమాను వచ్చే ఏడాది ఉగాది కానుకగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. ఇక ఈ సినిమా అనంతరం దర్శకుడు రాజమౌళి మహేష్ బాబుతో మరొక బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

  English summary
  Indian biggest pan india movie RRR team wraps up Ukraine schedule,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X