RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
ఇంటర్నెట్ ప్రపంచంలో కాపీ ఆరోపణలు ఏ రేంజ్ లో వస్తుంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ రోజుల్లో ఆడియెన్స్ ను మోసం చేయడం అంటే అంత సులువైన విషయం కాదు. వేరే సినిమాలతో కాస్త పోలిక ఉన్నా కూడా పసిగట్టేస్తారు. అనుకోకుండా మ్యాచ్ అయినా కూడా ఎవరు వదలడం లేదు. ఇక RRR సినిమాపై కూడా మరోసారి కాపీ ట్రోలింగ్స్ గోరంగా వైరల్ అవుతున్నాయి.

అందరి ఫోకస్ దానిపైనే
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అందరి ఫోకస్ దీనిపైనే ఉంది. ఇక నిన్న సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అంతా బాగానే ఉంది..కానీ
అక్టోబర్ 13న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక పోస్టర్ లో రామ్ చరణ్ గుర్రంపై వెళుతున్నట్లు ఉండగా జూనియర్ ఎన్టీఆర్ బైక్ పై ఫోర్స్ గా వెళుతుండడం ఆడియెన్స్ కు మంచి కిక్కిచ్చింది. అంతా బాగానే ఉంది కాని సినిమా పోస్టర్ ను కాపీ కొట్టినట్లు ఆరోపణలు రావడం వైరల్ గా మారింది.

ఇదివరకే టీజర్ పై ట్రోలింగ్
ఇదివరకే ఒకసారి RRRపై కాపీ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ టీజర్ వదిలినప్పుడు అందులో ఉన్న కొన్ని షాట్స్ ను ఏకంగా మరో వీడియోలో నుంచి లేపేశారని మీమ్స్ వచ్చాయి. ఆ విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం రిలీజ్ పోస్టర్ ను తస్కరించారని ఓ వర్గం నెటిజన్లు ఆడేసుకుంటున్నారు..

ఆ సినిమా నుంచి తస్కరించారని ట్రోల్స్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే హాలీవుడ్ మూవీ ఘోస్ట్ రైడర్ నుంచి తస్కరించారంటగా అంటూ ఓ వర్గం వారు నాన్ స్టాప్ గా ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో అభిమానులు అలాంటి ఆరోపణలకు ధీటైన సమాధానం చెబుతున్నారు. అందులో పెద్దగా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదని రాజమౌళి విజన్ కాస్త డిఫరెంట్ గానే ఉందని కామెంట్ చేస్తున్నారు.
Recommended Video

మరోసారి వాయిదా
గతంలో కూడా రాజమౌళి చాలా సినిమాలపై కాపీ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బాహుబలి లాంటి సినిమాలకు కూడా ఆ బాధ తప్పలేదు. ఇక RRR సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి మీమ్స్ వస్తాయో చూడాలి. ఇక సినిమాను మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు మరో రూమర్ కూడా వైరల్ అవుతోంది. డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను జనవరికి రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











