RRR ట్రైలర్ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. భారీగా ప్లాన్ చేసిన జక్కన్న!
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అత్యధిక మార్కెట్ తో తెరకెక్కుతున్న మొదటి మూవీ RRR. ఈ సినిమా కోసం నిర్మాత డి.వి.వి.దానయ్య 450 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి బాహుబలి అనంతరం నిర్మిస్తున్న సినిమా కావడం వలన అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని దాటేశాయి. ఇక అందరి ఫోకస్ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ట్రైలర్ పైనే ఉంది. ఇప్పటికే టీజర్ యూ ట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంది. ఇక ట్రైలర్ అయితే అంతకు మించి అనేలా ఉంటుందని భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నేడు సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది.

బలమైన నమ్మకంతో..
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తోడు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో కలిసి నటిస్తుండటంతో ఇరువర్గాల అభిమానులు ఈ సినిమా తప్పకుండా అంతకుమించి అనేలా ఉంటుందని ఒక బలమైన నమ్మకంతో ఉన్నారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రతి అంశం కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో హైప్ అయితే క్రియేట్ చేస్తోంది. అజయ్ దేవ్ గన్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

వాయిదా పడుతూ..
ఇక సినిమా విడుదల తేదీపై ఇటీవల ఫైనల్ గా ఒకటి క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ ఏడాది సమ్మర్ లోనే సినిమాను భారీగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా గత ఏడాది సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ అవ్వడంతో మళ్ళీ రెండు సార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. మొత్తానికి దసరా సమయంలో వస్తుందని అనుకున్న త్రిబుల్ ఆర్ చివరికి జనవరి 7వ తేదీన రావడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.
ట్రైలర్ డేట్ ఫిక్స్
RRR సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ టీజర్ కూడా సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం అందరి ఫోకస్ ట్రైలర్ పైనే ఉంది. సినిమా ట్రైలర్ ను బట్టి సినిమా పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే దర్శకుడు రాజమౌళి సరైన సమయం కోసం ఎదురు చూశాడు. డిసెంబర్ 3వ తేదీన RRR సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
Recommended Video

సాంగ్స్ సూపర్ హిట్
ఇప్పటివరకు వచ్చిన మూడు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దోస్తీ పాట తో పాటు నాటు నాటు సాంగ్ మాస్ ప్రేక్షకులను స్టెప్పులు వేయించేలా చేశాయి. ఇటీవల విడుదలైన జనని పాట అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఎమోషనల్ గా టచ్ చేసినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ లో ఈ మూడు పాటలు కూడా భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకున్నాయి. అలాగే మరికొన్ని పాటలు కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా టీజర్ కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ డిసెంబర్ 3వ తేదీన రాబోతోంది. మరి ఈ ట్రైలర్ అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











