RRR కోసం రంగంలోకి సీఎం.. ఎవరూ ఊహించని చోట ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జక్కన్న ప్లాన్ అదేనా?
ఇండియాలో అతిపెద్ద మల్టీస్టారర్ అయిన RRR రౌద్రం రణం రుధిరం ప్రమోషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురూ ఇంటర్వ్యూ ఇస్తూ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న RRR సినిమా కోసం భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారు మేకర్స్. ముఖ్యంగా కర్ణాటకలో భారీ ఈవెంట్ జరగనుందని చాలా రోజులుగా వార్తలు వస్తుండగా తాజాగా ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు.
ఇప్పటి వరకు ప్రచారం జరిగినట్టుగా మార్చి 19న కర్ణాటకలోని చిక్కబల్లాపురలో సాయంత్రం 6 గంటలకు RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అయితే అదే ప్రాంతాన్ని ఎన్నుకోవడానికి ఒక కారణం ఉందని అంటున్నారు.

మాస్టర్ ప్లాన్
నాలుగు సంవత్సరాల క్రితం ప్రకటించిన RRR సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని తెలుగు మాత్రమే కాదు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. RRR రిలీజ్ కి ఇంకా సుమారు పది రోజులే సమయం ఉంది.
మార్చ్ 25న ఆడియన్స్ ముందుకు వస్తున్న RRR గ్రాండియర్ ప్రమోషన్స్ తో, ఫ్యాన్స్ సినిమా విడుదలకు ముందే ఒకరకమైన పండగ చేసుకోవాలని, ఆ దెబ్బతో జాతరకు వచ్చినట్టు ప్రేక్షకులను థియేటర్లకి రప్పించాలని జక్కన్న మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.

తెలివిగా ఎగ్జిక్యూట్
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, అజయ్ దేవగన్, ఆలియా భట్ లాంటి పాన్ ఇండియా సెలబ్రిటీలు భాగమైన RRR మార్చి 25న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అది వెంటనే వైరల్ అవుతోంది. రాజమౌళి సినిమాను ఎంత గ్రాండ్ గా తెరకెక్కిస్తారో ప్రమోషన్ కూడా అంతే తెలివిగా ఎగ్జిక్యూట్ చేస్తారని అనేక సార్లు ప్రూవ్ అయింది. ఇప్పటికే RRR కోసం పీక్స్ లో ప్రమోషన్స్ చేశారు.
చిక్కబళ్లాపూర్‌ని ఎందు
అయితే ఊహించని పరిణామాలతో వాయిదా పడిన ట్రిపుల్ ఆర్ రీ ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది జక్కన్న టీమ్. మార్చి 18న దుబాయ్ లో బిగ్గెస్ట్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశారు. ఇక మార్చి 19న కర్ణాటక చిక్ బళ్లాపూర్ లో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే RRR ఈవెంట్ కోసం రాజమౌళి చిక్కబళ్లాపూర్‌ని ఎందుకు ఎంచుకున్నారో అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు.

జక్కన్న ప్లాన్
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుక నిర్వహిస్తే జనాలను మేనేజ్ చేయడం చాలా కష్టం కాబట్టి, రాజమౌళి చిక్కబళ్లాపూర్‌ని ఎంచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిక్కబళ్లాపూర్ ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. అవడానికి ఇది కర్ణాటక ప్రాంతమే ఈ పట్టణం తెలుగు ప్రజలతో నిండిపోయింది. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌లకు ఈ ప్రాంతంలో భారీ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి, వెంట్‌ను నిర్వహించడానికి ఇది సరైన లొకేషన్ అని రాజమౌళి భావించాడు. అలాగే, కర్ణాటక మార్కెట్ పెద్దది మరియు ఈ ఈవెంట్ ఒకేసారి తెలుగు మరియు కన్నడ రెండింటినీ కవర్ చేస్తుందని జక్కన్న ప్లాన్ చేశారని అంటున్నారు.

ముఖ్య అతిథులుగా
ఇప్పటివరకు దేశంలోనే అతి పెద్ద ఈవెంట్‌గా జరగనున్న ఈ కార్యక్రమానికి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది హాజరవుతారని అంచనా. రాజమౌళి ప్లానింగ్‌లో మాస్టర్ కావడంతో తెలుగు రాష్ట్రాల అభిమానులను ఈ ఈవెంట్‌కు దూరంగా ఉంచారని అంటున్నారు. ఇక ఈ ఈవెంట్ కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మే, హెల్త్ మినిస్టర్, అలాగే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అలాగే ఈ ఈవెంట్ ను కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం ఇస్తున్నట్లు వేదికమీద ప్రకటించనున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











