twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR US Premier Shows Review: బొమ్మ దద్దరిల్లింది.. సోషల్ మీడియాలో ఊహించని విధంగా, సినిమా ఎలా ఉందంటే

    |

    యంగ్ టైగర్ రామారావు, మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందిన RRR సినిమా ఎట్టకేలకు విడుదలైంది. నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు పండగ వాతావరణాన్ని ఈ సినిమా తెచ్చింది. బొమ్మ దద్దరిల్లిందనే టాక్ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టాక్ గురించిన వివరాల్లోకి వెళితే..

    తొలి షో హైదరాబాద్‌లోని ఏఎంబీలో

    తొలి షో హైదరాబాద్‌లోని ఏఎంబీలో

    ప్రపంచవ్యాప్తంగా RRR సినిమాకు సంబంధించిన తొలి షో హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాలో పడింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వీఐపీ స్క్రీన్‌లో సినిమాను గురువారం రాత్రి 9 గంటల నుంచి చూడటం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను వీక్షించేందుకు వచ్చారు. ఎన్టీఆర్ వెంట కల్యాణ్ రామ్, తదితరులు సినిమాను వీక్షించారు.

    చిరంజీవి ఫ్యామిలీ, నాగవంశీ

    చిరంజీవి ఫ్యామిలీ, నాగవంశీ

    ఇదిలా ఉండగా.. గురువారం అర్ధరాత్రి నుంచి ఏఎంబీలోని నాలుగు స్క్రీన్లలో సెలెబ్రిటీల షోలు రన్ అయ్యాయి. చిరంజీవి ఫ్యామిలీ, నాగవంశీ తదితరులు ప్రైవేట్ స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేసుకొన్నారు. దీంతో ఏఎంబీ వద్ద అభిమానులు, ప్రేక్షకులతో హంగామా నెలకొన్నది.

    యూఎస్‌లో RRR సినిమా

    ఇదిలా ఉండగా, యూఎస్‌లో RRR సినిమాకు సంబంధించిన వివరాలతో నెటిజన్లు, అభిమానులు పొటెత్తారు. RRR ఇంటెర్వెల్ అయింది. భాష గురించి మరిచిపోండి. దానిని పట్టించుకోకండి. ఇండియాలో ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకొంటారు. ఇలాంటి డైరెక్టర్, నటులు ఉన్నారని అందరూ గర్వంగా ఫీల్ అవుతారు. ఈ సినిమాకు నా రేటింగ్ 5/5 అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

    సెకండాఫ్‌లో ఒక పర్టిక్యులర్ సీన్

    RRR సినిమాలో సెకండాఫ్‌లో ఒక పర్టిక్యులర్ సీన్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఇంకా నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. రాజమౌళికి దండాలు పెట్టాలి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండుగే అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

    ఎన్టీఆర్ ఇంట్రో

    RRR మూవీలో ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోయింది. పులితో ఫైట్ సీన్‌లో ఎన్టీఆర్ యంగ్ టైగర్ అనిపించుకొన్నాడు. యంగ్ టైగర్ బ్రాండ్ మరో లెవెల్‌కు వెళ్తుంది. ఫ్యాన్స్‌కు పూనకాలే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదే బెస్ట్ ఎంట్రీ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

    ఇంటర్వెల్ బ్లాక్ ఎలివేషన్ సూపర్

    RRR మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ ఎలివేషన్ సూపర్. రాజమౌళి మార్క్ ఎలివేషన్‌తో ఇంటర్వెల్ సీన్ పిచ్చెక్కింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు, కామన్ ఆడియన్స్‌కు పూనకాలే అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

    రాంచరణ్ ఫ్లయింగ్ సీన్

    RRR మూవీలో రాంచరణ్ ఫ్లయింగ్ సీన్ సూపర్‌గా ఉంది. జంప్ సూట్ లేకుండానే ఇంట్రడక్షన్ సీన్ చేశాడు. ఎంట్రీ సీన్‌లో జూనియర్ ఎన్టీఆర్ యోగా చేశాడు. తెలుగు సినిమా రంగంలో ఓవర్ డోస్ ఎక్కువైంది అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు.

    English summary
    SS Rajamouli's RRR hits the screen. Here is the premier show talk report.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X