Oscars 2023 అవార్డుల వేడుకకు ఎందుకు దూరం అంటే.. RRR నిర్మాత డీవీవీ దానయ్య క్లారిటీ
ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాటకు మరోసారి అత్యున్నత అవార్డులతో పట్టం కట్టారు. RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ప్రపంచం గర్వించే మారిన సంఘటనలో గానీ, సినిమా సంబురాల్లో గానీ నిర్మాత డీవీవీ దానయ్య కనిపించకపోవడం అనేక అనుమానాలకు, సందేహాలకు దారి తీసింది. ఆస్కార్ అవార్డు తర్వాత నిర్మాత దానయ్య అనేక సందేహాలకు వివరణ ఇస్తూ..

కష్టానికి ఫలితమే అవార్డు
RRR సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగు సినిమాకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. క్రెడిట్ మొత్తం ఎస్ఎస్ రాజమౌళికే దక్కుతుంది. నాటు నాటు పాటలో భాగమైన కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, ఈ పాటపై పెర్ఫార్మ్ చేసిన ఎన్టీఆర్, రాంచరణ్‌కు కంగ్రాట్స్. ప్రతీ ఒక్కరు ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు. చాలా భారీ ఖర్చు పెట్టి సినిమా తీశాం. దానికి ఫలితమే ఆస్కార్ అవార్డు అని డీవీవీ దానయ్య అన్నారు.

ఇద్దరు స్టార్స్ సినిమా ఊహించలేదు
రాజమౌళితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. 2006 సంవత్సరంలో నేను రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చాను. మధ్యలో మర్యాద రామన్న సినిమా ఆఫర్ ఇచ్చారు. అయితే నేను ఆ ఆఫర్ వద్దని.. పెద్ద సినిమా చేయాలని ఉందని చెప్పాను. ఆ తర్వాత RRR ఆఫర్ ఇచ్చారు. ఇద్దరు స్టార్స్‌తో సినిమా చేయడం ఊహించలేదు. ఇంత పెద్ద సినిమా రాజమౌళి చేస్తారని అనుకోలేదు అని డీవీవీ దానయ్య అన్నారు.

స్పెషల్ ఫ్లయిట్‌లో ఉక్రేయిన్‌కు
RRR సినిమా నిర్మాణం చాలా ప్రతికూల పరిస్థితుల్లో జరిగింది. ఈ సినిమా షూట్ సమయంలో రెండుసార్లు కరోనా వచ్చింది. చాలా కష్టపడి చేశాం. బడ్జెట్ అనుకొన్న దానికంటే ఎక్కువ అయింది. కరోనా సమయంలో ఫ్తయిట్స్ లేకపోవడంతో ప్రత్యేకంగా విమానం తీసుకొని..టీమ్ అంతా ఉక్రేయిన్‌కు వెళ్లాం. నాటు నాటు పాట ఉక్రేయిన్‌లో 17 రోజులపాటు షూట్ చేశాం. ఇద్దరు హీరోలు నెలరోజులు ప్రాక్టీస్ చేశారు. మేము కష్టపడిన తీరకు ఫలితం దక్కింది అని డీవీవీ దానయ్య చెప్పారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతోనే..
ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు అవార్డు ప్రకటించగానే.. కలనా? నిజమా అనిపించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతోనే నేను ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని ఊహించాను. నేను ఊహించినట్టు అవార్డు వచ్చింది. చాలా సంతోషంగా ఉండటమే కాకుండా గర్వంగా ఉంది. అయితే నేను ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటాను. ముందు కనిపించను. వెనుక ఉండి సపోర్ట్ చేస్తాను. అందుకే నేను ఆస్కార్ ప్రమోషన్‌లో కనిపించలేదు అని డీవీవీ దానయ్య అన్నారు.

కీరవాణికి ఫోన్ చేస్తే..
ఆస్కార్ అవార్డు అందుకొన్న తర్వాత అమెరికాలో ఉన్న RRR టీమ్‌కు మెసేజ్ పంపి అభినందించాను. నేను కీరవాణితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. బిజీగా ఉన్నామని చెప్పారు. రాజమౌళితో మరో సినిమా ఉంటుందా అనే ప్రశ్నకు ఇప్పడే ఏమీ చెప్పలేను. టీమ్ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత వారితో చర్చించి సెలబ్రేషన్స్‌ను ప్లాన్ చేస్తాం అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











