RRR నిర్మాతకు హార్ట్ సర్జరీ.. కోలుకొంటున్న డీవీవీ దానయ్య
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్యకు ఇటీవల హార్ట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి ఇంటిలో విశ్రాంతి తీసుకొంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆంజియోప్లాస్టీ చికిత్స జరిగిందని ఆయన సన్నిహితులు వెల్లడించారు.
గతవారం ఛాతిలో నొప్పి అని చెప్పడంతో ఆయనను మే చివరి వారంలో హాస్పిటల్‌కు తరలించారు. అయితే హార్ట్ సర్జరీ తప్పని కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స జరిపారు. అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన తర్వాత డిశ్చార్జి చేశారు అని సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ చిత్రాలను డీవీవీ దానయ్య నిర్మించి ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు శివమణి, దేశముదురు, కృష్ణ, నాయక్, భరత్ అనే నేను చిత్రాలను నిర్మించారు.
ప్రస్తుతం రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రాన్ని భారీ ప్రాజెక్టుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవగణ్, అలియాభట్ నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే భారీ సెట్ వేసి షూటింగ్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.


Click it and Unblock the Notifications











