Oscar 2023 RRR: ఆస్కార్ యుద్దానికి రాంచరణ్.. అమెరికా బయలుదేరిన మెగా పవర్‌స్టార్!
2023 ఆస్కార్ అవార్డ్స్ లో RRR సినిమాకు ఎలాంటి గుర్తింపు లభిస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది హాలీవుడ్ సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తప్పకుండా ఆస్కార్ బరిలో నిలిచి మరింత గుర్తింపును అందుకుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. బెస్ట్ సాంగ్స్ లో RRR నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వేడుక కోసం చిత్ర యూనిట్ సభ్యులు అకాడమీ వేడుకకు వెళ్ళనున్నారు. అయితే అంతకంటే ముందు రామ్ చరణ్ మరో వేడుకలో పాల్గొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
బిగ్గెస్ట్ ఇండియన్ మల్టీస్టారర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా ఇండియా స్థాయిని పెంచే విధంగా మంచి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం రాజమౌళి మేకింగ్ విధానానికి ఫిదా అయ్యారు.

హాలీవుడ్ ప్రశంసలు
అయితే RRR సినిమాకు సంబంధించిన నాటు నాటు పాట 2023 ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్స్ లో నిలిచిన విషయం తెలిసిందే. తప్పకుండా ఈ పాటకు అకాడమీ అవార్డ్స్ లభిస్తుంది అని సినీ లవర్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ RRR దర్శకుడిపై ఊహించని స్థాయిలో ప్రశంసలు కురిపించాడు.

గోల్డెన్ గ్లొబ్ అవార్డ్
ఇదివరకే RRR పాటకు గోల్డెన్ గ్లొబ్ అవార్డు కూడా దక్కడం విశేషం. అక్కడే జేమ్స్ కెమెరూన్ ప్రత్యేకంగా చిత్ర యూనిట్ ని కలిసి ప్రశంసలు గుర్తించారు. ఇక ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ కోసం కూడా చిత్ర యూనిట్ అమెరికాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అమెరికాకు ముందుగా రామ్ చరణ్ బయలుదేరడం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

ఆస్కార్ కోసం..
నిజానికి రామ్ చరణ్ వెళ్ళింది ఆస్కార్ వేడుక కోసం కాదట. హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ విభాగంలో RRR సినిమా నిలిచింది. ఇక ప్రెజెంటర్ లిస్ట్ లో భాగంగా రామ్ చరణ్ వెళ్లడం జరిగింది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు మరణం వలన రాలేని పరిస్థితులలో ఉన్నాడు. మరోవైపు రాజమౌళి కూడా మహేష్ బాబుకు సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలో కూడా బిజీ అయ్యాడు.

ఆ ఈవెంట్ కోసం రామ్ చరణ్
ఇద్దరు బిజీగా ఉండడం వలన రామ్ చరణ్ ఫిబ్రవరి 24న జరగనున్న HCA వేడుకలో RRR మూవీ తరపున వెళ్లడం జరిగింది. ఇక ఆస్కార్ అవార్డ్ వేడుక మార్చి 13వ తేదీన జరగనుంది. ఈ వేడుకకు మాత్రం RRR టీమ్ సభ్యులు మొత్తం పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ మళ్ళీ ఇండియాకు వచ్చిన అనంతరం రాజమౌళి, ఎన్టీఆర్ లతో కలిసి యూఎస్ కు బయలుదే అవకాశం ఉంది.

అందరి కోరిక ఒక్కటే..
ఇక ఈసారి ఆస్కార్ అవార్డ్స్ లో తప్పకుండా RRR సినిమాకు సంబంధించిన ప్రస్తావన గట్టిగానే హైలైట్ అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఇక ఆస్కార్ వేదికగా ఒకవేళ ఈ సినిమాకు అవార్డు దక్కితే ఆ వేడుకలో హీరోలు దర్శకుడు ఏ విధంగా మాట్లాడుతారు అనేది కూడా అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఫ్యాన్స్ అలాగే తెలుగు సినిమా లవర్స్ తో పాటు చాలామంది సినీ ప్రముఖులు కూడా తప్పకుండా ఈ సినిమా ఆస్కార్ అవార్డును గెలుపొందాలని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











