Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
RRRలో ఆ ఒక్క సీన్.. మగధీర బడ్జెట్ కంటే ఎక్కువే.. మరో మర్యాద రామన్న కూడా తీయొచ్చు
దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా బడ్జెట్ విషయంలో మాత్రం లిమిట్స్ గట్టిగానే పెట్టుకుంటాడు. కానీ ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఆ బడ్జెట్ హద్దులు తెలియకుండానే పెరిగిపోతుంటాయి. ఇంతవరకు మొదటి రెండు మూడు సినిమాలు తప్పితే మిగతా సినిమాల మొత్తం బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యిందట. ఇక RRR సినిమా కోసం ఆయన ఏ రేంజ్ లో కష్టపడుతున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా ప్రతి సన్నివేశాన్ని చాలా కాస్ట్లీగా తెరకెక్కించబోతున్నారు.
50రోజుకు గ్యాప్ లేకుండా షూటింగ్
ఇటీవల RRR చిత్ర యూనిట్ ఒక కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అర్ధరాత్రుళ్ళు చాలిలో షూటింగ్స్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు మొత్తానికి ఒక మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసి వీడియోను కూడా విడుదల చేశారు. దాదాపు 50రోజులు గ్యాప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు చెప్పిన RRR టీమ్ త్వరలోనే మరొక కీలకమైన షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు.
ఆ ఒక్క సీన్ కోసం ఖర్చు ఎంతో తెలుసా
అయితే సినిమాలో ఆ సీన్ 6 నిమిషాలు కూడా ఉండదట. కానీ సినిమా మొత్తానికి ఆ సీన్ చాలా కీలకమని ఎమోషన్స్ తో పాటు ఆడియెన్స్ రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయని తెలుస్తోంది. మరి అలాంటి సీన్ కోసం జక్కన్న చేసే ఖర్చు ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు 55కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని టాక్ అయితే వస్తోంది.
ఆ బడ్జెట్ మగధీర కంటే ఎక్కువే..
55కోట్లు అంటే గతంలో రాజమౌళి చేసిన (బాహుబలి మినహా) సినిమాల మొత్తం కంటే చాలా అది ఎక్కువననే చెప్పాలి. ఒక మగధీర సినిమా బడ్జెట్ 40కోట్ల లోపే. అలాంటిది ఇప్పుడు ఒక్క ఆరు నిమిషాల కోసం 55 కోట్ల ఖర్చు వచ్చింది అంటే రాజమౌళి ఆలోచన తీరు ఏ స్థాయికి వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మగధీర అనే కాకుండా ఆ సీన్ బడ్జెట్ తో మరో మర్యాద రామన్న సినిమా కూడా తీయవచ్చు.
Recommended Video
సినిమా విడుదల ఎప్పుడంటే
ఇక ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన టీజర్స్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ రానున్న క్రిస్టమస్, న్యూ ఇయర్ సందర్భంగా మరేమైనా టీజర్స్ ను విడుదల చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమా విడుదలపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. ఇంకా షూటింగ్ పనులు చాలానే ఉన్నాయి. సమ్మర్ వరకు ఆ పనులు పూర్తయ్యేలా లేవట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరో ఆరు నెలలకు పైగా సమయం పట్టవచ్చు. అందుకే 2022 సంక్రాంతికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని మరికొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.