RRR release in Japan జపాన్‌కు ఉపాసనతో రాంచరణ్.. ఆస్కార్‌కు ముందు రాజమౌళి బంపర్‌ప్లాన్, ఖర్చు ఎంతంటే?

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ షూటింగులు, ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర షూటింగులో నిర్విరామంగా పాల్గొన్నారు. రాజమండ్రికి సమీపంలో నిర్వహించిన ఓరి దేవుడా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించి అభిమానులకు జోష్ పుట్టించాడు. రాజమండ్రిలో శంకర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన రాంచరణ్.. భార్య ఉపాసన కొణిదెలతో కలిసి జపాన్‌కు ప్రయాణం అయ్యారు. జపాన్‌లో RRR మూవీ ప్రమోషన్స్ వివరాల్లోకి వెళితే..

ఆస్కార్ ప్రమోషన్స్‌కు ముందు

ఆస్కార్ ప్రమోషన్స్‌కు ముందు

జపాన్‌లో RRR రిలీజ్ చేయడం ద్వారా ఆస్కార్ ప్రమోషన్స్‌కు ఉపయోగపడేలా దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పలు కేటగిరిలో RRR సినిమాను నామినేట్ చేసుకొన్నారు. ఆస్కార్‌లో అవార్డును సొంతం చేసుకోవడానికి దాదాపు 10 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టేందుకు ఓ పీఆర్ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్టు సమాచారం.

ఎన్టీఆర్, రాంచరణ్‌తో కలిసి

ఎన్టీఆర్, రాంచరణ్‌తో కలిసి

ఆస్కార్‌కు ముందు ట్రయల్‌గా RRR మూవీకి ప్రపంచవాప్యంగా క్రేజ్ తెప్పించేలా రాజమౌళ్లి ప్లాన్ చేశారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో ప్రమోషన్స్ ప్రారంభించారు. జపాన్ మీడియాకు ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బీజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జపాన్‌లోని RRR టీమ్‌లో రాంచరణ్ చేరునున్నారు. రాంచరణ్ పర్యటన దాదాపు వారంపాటు ఉండే అవకాశం ఉందని తెలిసింది.

ఉపాసనతో కలిసి జపాన్ ట్రిప్

ఉపాసనతో కలిసి జపాన్ ట్రిప్


జపాన్‌లో రిలీజ్ కానున్న RRR సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు రాంచరణ్ భార్యతో కలిసి బయలుదేరారు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టులో ఉపాసనతో కలిసి మీడియా కంటపడ్డారు. ఎప్పటి మాదిరిగానే రాంచరణ్ తన పెంపుడు కుక్కతో కనిపించాడు.

పెంపుడు కుక్కతో రాంచరణ్ దంపతులు

పెంపుడు కుక్కతో రాంచరణ్ దంపతులు


రాంచరణ్, ఉపాసన దంపతులు తమ పెంపుడు కుక్కపిల్లను అప్యాయంగా ప్రేమతో చూసుకోవడం అందర్నీ ఆకట్టుకొన్నది. ప్రస్తుతం రాంచరణ్ జపాన్ పర్యటన గురించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ ఫోటోలను భారీగా షేర్ చేస్తున్నారు.

జపాన్‌లో అక్టోబర్ 21 RRR రిలీజ్

జపాన్‌లో అక్టోబర్ 21 RRR రిలీజ్


ఇక RRR మూవీ రిలీజ్ విషయానికి వస్తే.. అక్టోబర్ 21వ తేదీన భారీస్థాయిలో మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే జపాన్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా RRR చిత్రం 1200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమా బాహుబలి 2, దంగల్, కేజీఎఫ్2 చిత్రం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. ఇక జపాన్‌లో ఏ మేరకు మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X