For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR యూనిట్ శుభవార్త.. రిలీజ్ వాయిదా నేపథ్యంలో జక్కన మరో బంపర్ ప్లాన్

  |

  ప్రపంచ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం RRR. బాహుబలి తర్వాత దర్శకధీరుడు ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు అందుకొన్నది. అయితే ఈ చిత్రం ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. అనేక అవాంతరాలు, అడ్డంకులు వచ్చి పడుతున్నాయి. అయితే గతంలో ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ప్రస్తుతం మరోసారి రిలీజ్ వాయిదా పడింది. రిలీజ్ వాయిదాపై RRR యూనిట్ అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

  థియేటర్ల మూసివేత సంక్షోభంతో

  థియేటర్ల మూసివేత సంక్షోభంతో

  RRR చిత్రం వాస్తవానికి అక్టోబర్ 13వ తేదీన దసరా పండుగ కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం ఓ కారణమైతే.. థియేటర్లు పూర్తిగా తెరవకపోవడం, అలాగే టికెట్ రేట్ల వివాదం ఏపీలో కొనసాగడం మరో కారణంగా మారాయి. దాంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. దాంతో అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఓ శుభవార్తను అందించారు.

  ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా

  ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా

  అయితే RRR చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాలను యూనిట్ చేపట్టేందుకు నిర్ణయించుకొన్నట్టు సమాచారం. RRR చిత్రానికి సంబంధించిన తొలి సింగిల్‌ను రిలీజ్ చేయగా భారీ రెస్సాన్ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెండో సింగిల్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలోని రెండో పాటను మరో రెండు వారాల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. రాంచరణ్, ఆలియాభట్‌పై చిత్రీకరించిన మాంటేజ్ సాంగ్‌ను 2వ సింగిల్‌గా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.

  కేకే సెంథిల్ కుమార్ ట్వీట్ చేసి..

  కేకే సెంథిల్ కుమార్ ట్వీట్ చేసి..

  అయితే RRR సినిమా డిజిటల్ ఇంట్రిగేషన్, కలర్ గ్రేడింగ్ ప్రాసెస్ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి అని సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో కలరిస్ట్ శివ, చీఫ్ అసోసియేట్‌ రమేష్ కుషేందర్, అసోసియేట్ రమా మారుతితో కలిసి చేస్తున్నాం అని సెంథిల్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

  400 కోట్ల రూపాయల వ్యయంతో

  400 కోట్ల రూపాయల వ్యయంతో

  RRR మూవీ విషయానికి వస్తే.. సుమారు 400 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. తెలుగు సినిమా చరిత్రలో గతంలో లేని విధంగా స్టార్ హీరోలు, సాంకేతిక నిపుణులతో తెరక్కెకించారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు, లవ్ ట్రాక్ సరికొత్తగా ఉంటాయనే విషయాన్ని చిత్ర యూనిట్ పలు సందర్బాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లకుపైగానే జరిగినట్టు తెలుస్తున్నది.

  RRRలో నటీనటులు: సాంకేతిక నిపుణులు

  RRRలో నటీనటులు: సాంకేతిక నిపుణులు


  నటీనటులు: ఎన్టీఆర్, రాంచరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రీయ సరన్, ఓలియా మోరిస్, అలిసన్ డూడీ,, రే స్టీవెన్‌సన్ తదితరులు
  దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి
  నిర్మాత: డీవీవీ దానయ్య
  డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
  సినిమాటోగ్రఫి: కేకే సెంథిల్ కుమార్
  ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
  మ్యూజిక్: ఎంఎం కీరవాణి
  బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
  డిస్ట్రిబ్యూషన్: లైకా ప్రొడక్షన్స్ (తమిళం), పెన్ స్టూడియోస్ (నార్త్)
  రిలీజ్ డేట్: 2021-10-13

  English summary
  RRR's second Single to release in two weeks. Ram Charan and Alia Bhatt's montage song will release as Second Single.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X