మొత్తానికి ఓ పనైపోయింది.. RRR షూటింగ్ వీడియోతో క్లారిటీ ఇచ్చిన టీమ్
టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియాన్ మూవీ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి తరువాత రాజమౌళి ఎక్కువ సమయాన్ని తీసుకొని చేస్తున్న చిత్రమేదే. ఒక ఏడాది టైమ్ లోనే సినిమా షూటింగ్ ను ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విదంగా మొదట్లోనే కొంత ఆలస్యం చేసిన జక్కన్నకి ఆ తరువాత కరోనా మరో పెద్ద షాక్ ఇచ్చింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది పెద్ద మిస్టరీగా మారింది.
ఇక ఇటీవల అర్ధరాత్రుళ్ళు చాలిలో షూటింగ్స్ చేసిన చిత్ర యూనిట్ సభ్యులు మొత్తానికి ఒక మేజర్ షెడ్యూల్ ని ఫినిష్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. దాదాపు 50రోజులు గ్యాప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు చెప్పిన RRR టీమ్ త్వరలోనే మరొక కీలకమైన షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉందట.

ఇక ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు సంబంధించిన టీజర్స్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ రానున్న క్రిస్టమస్, న్యూ ఇయర్ సందర్భంగా మరేమైనా టీజర్స్ ను విడుదల చేస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమా విడుదలపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా లేదు. ఇంకా షూటింగ్ పనులు చాలానే ఉన్నాయి. సమ్మర్ వరకు ఆ పనులు పూర్తయ్యేలా లేవట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరో ఆరు నెలలకు పైగా సమయం పట్టవచ్చు. అందుకే 2022 సంక్రాంతికి సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని మరికొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











