RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
ఇండియాలో మునుపెన్నడు లేని విదంగా బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న RRR సినిమా కోసం మెగా, నందమూరి అభిమానులు ఏ రేంజ్ ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీపై అంచనాల డోస్ రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. బాహుబలి అనంతరం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ పై రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి.

భారీ స్థాయిలో బిజినెస్ డీల్స్
ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా మొదటి రోజే ఈజీగా వందకోట్లను రాబట్టగలదని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమాను ఇదే ఏడాది అక్టోబర్ 13న గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా చాలా వరకు క్లోజ్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన ఏరియాల్లో భారీ ధరకు సినిమా అమ్ముడైనట్లు సమాచారం.

2పాయింట్ ఓ నిర్మాతలు కూడా..
ఈ మూవీ బిజినెస్ లో కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ లైకా కూడా భాగం కానుంది. సినిమా తమిళ హక్కులకు సంబంధించిన ధరపై చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి.RRR తమిళ థియేట్రికల్ రైట్స్ 50కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు మొదట్లో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా లైకా ప్రొడక్షన్ వాళ్ళు 42కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

జక్కన్న స్పెషల్ ప్లాన్స్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యదిక స్థాయిలో బిజినెస్ చేస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ పెంచేందుకు దర్శకుడు జక్కన్న స్పెషల్ ప్లాన్స్ వేస్తున్నాడు. ముఖ్యంగా సినిమాను బాలీవుడ్ లో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఇక మార్చ్ 15న ఒక స్పెషల్ అప్డేర్ రానున్నట్లు తెలుస్తోంది.

మార్చ్ 15న.. ఎందుకంటే?
ఇప్పటికే హీరోలకు సంబంధించిన టీజర్స్ రెండు వచ్చేశాయి. అలాగే మెయిన్ లీడ్ కు సంబంధించిన ఫారిన్ ఆర్టిస్టుల పోస్టర్స్ ను కూడా ముందే రిలీజ్ చేశారు. మరికొందరి లుక్స్ కూడా రివీల్ చేయాల్సి ఉంది. ఇక నెక్స్ట్ రాజమౌళి అలియా భట్ క్యారెక్టర్ పై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు జోడిగా ఆమె సీత పాత్రలో నటిస్తోంది. ఇక మార్చ్ 15న అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఆ డేట్ వరకు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











