RRR: స్క్రీన్ ముందు ఎగరకుండా అభిమానులకు ఝలక్ ఇస్తున్న థియేటర్స్ టీమ్స్.. పోటో చూస్తే షాక్!

మెగా నందమూరి హీరో కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ సినిమా మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. గత రెండేళ్లుగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఐదు సార్లు వాయిదా పడిన RRR ఫైనల్ గా మార్చి 25 వ తేదీన విడుదల కాబోతొంది. ఈ సినిమాను ఒక ఫెస్టివల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులకు ఒక థియేటర్స్ యాజమాన్యం మాత్రం ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

తెల్లవారుజామున స్పెషల్ షోలతో..

తెల్లవారుజామున స్పెషల్ షోలతో..

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ అలాగే ఇతర దేశ భాషల్లో కూడా సినిమా విడుదల కాబోతోంది. శుక్రవారం తెల్లవారుజామున సినిమాకు సంబంధించిన స్పెషల్ షోలతో అభిమానుల హడావుడితో RRR రికార్డులు స్టార్ట్ కానున్నాయి.

తప్పకుండా పాజిటివ్ టాక్ తో..

తప్పకుండా పాజిటివ్ టాక్ తో..

రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించిన ఈ సినిమా కంప్లీట్ గా ఫిక్షన్ కథ గా రూపొందించినట్లు రాజమౌళి ముందుగానే చెప్పాడు. ఇక పెద్దగా వివాదాలు అయితే ఇంతవరకు హైలెట్ కాలేదు. ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే సినిమా విడుదల పైనే ఉంది. తప్పకుండా పాజిటివ్ టాక్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ కూడా సాధిస్తుంది అని బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కంట్రోల్ చేయడం సాధ్యం కాదు..

కంట్రోల్ చేయడం సాధ్యం కాదు..

అయితే సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే థియేటర్లో అభిమానుల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరూ ఆనందానికి అవధులు లేకుండా స్క్రీన్ ముందు ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. ఇక వారిని కంట్రోల్ చేయడం అయితే దియేటర్స్ వర్కర్స్ కు అంత ఈజీ కాదు. కొన్నిసార్లు వారి వల్ల స్క్రీన్స్ డ్యామేజ్ అవుతుంటాయి. పలుమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ఎవరూ ఆ విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

 గొడవలు జరగకుండా..

గొడవలు జరగకుండా..

అయితే ఈసారి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పోటాపోటీ హడావుడిని తట్టుకోవడం కూడా థియేటర్స్ యాజమాన్యానికి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. థియేటర్స్ ముందు అయితే ఎలాంటి కొట్లాటలు జరగకుండా ముందుగానే ప్రత్యేకమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన బ్యానర్ లు కూడా వివాదాలకు తావు ఇవ్వకుండా ఉండాలి అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

థియేటర్స్ లో ఫెన్సింగ్

థియేటర్స్ లో ఫెన్సింగ్

అయితే శ్రీకాకుళంలో ఒక థియేటర్ యజమాన్యం మాత్రం అభిమానుల హడావిడికి ఎవరు ఊహించని విధంగా బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తోంది. సూర్య మహల్ అనే ఒక థియేటర్ యాజమాన్యం అభిమానులు స్క్రీన్ ముందు ఏమాత్రం ఎగరకుండా ముందుగానే ఫెన్సింగ్ వేసి ఉంచారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా మీమ్స్ కూడా చాలా ఫన్నీగా వస్తున్నాయి. ఇప్పుడు ఏ అభిమాని కూడా స్క్రీన్ ముందు ఎగిరే అవకాశం లేదు అని చెప్పవచ్చు. గతంలో తమిళంలో వలిమై సినిమా కోసం కూడా ఒక థియేటర్ యాజమాన్యం స్క్రీన్ ముందు మేకులతో ప్రత్యేకమైన చెక్కులను ఏర్పాటు చేసిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X