RRR: రన్నరప్ గా నిలిచినా ఏకైక ఇండియన్ సినిమా.. తెలుగు సినిమాకు పట్టం కట్టిన హాలీవుడ్ క్రిటిక్స్?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో సినిమా కలెక్షన్స్ చాటి చెప్పాయి. RRR (రౌద్రం రణం రుధిరం) పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది.అనేక వాయిదాల తర్వాత మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ ఆ వివరాలు

కీలక పాత్రల్లో
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, కొమురం భీం పాత్రలో నటించిన తారక్ సరసన జెన్నీ ఒలీవియా మోరిస్ నటించారు. అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా శ్రియ శరణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు.

తెలుగు సినిమా సత్తా
ఈ మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్లలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ బాషలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. డీవీవీ దానయ్య నిర్మాణంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కించి విడుదల చేయగా, విడుదలైన అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1, 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో తెలుగు సినిమా సత్తా చాటింది.

హాలీవుడ్ నుంచి
ఇక "ఆర్ఆర్ఆర్"హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడంతో ఈ సినిమా ఇప్పుడు విదేశీ ప్రేక్షకులకు కూడా నచ్చుతోంది. ఈ సినిమా బాగుందని ఇప్పటికే పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా "ఆర్ ఆర్ ఆర్ " మూవీ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో "ఆర్ ఆర్ ఆర్ "మూవీ తప్ప మిగతా అన్ని చిత్రాలు కూడా హాలీవుడ్ నుంచి ఉన్నాయి.

రన్నరప్ గా
ఆ పది సినిమాల లిస్టులో ఫస్ట్ టైమ్ ఎంపిక కాబడిన ఇండియన్ మూవీగా "ఆర్ ఆర్ ఆర్ "నిలిచింది. తాజాగా ఈ సినిమా ఆ పది సినిమాల్లోకి గాను రెండో స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ సినిమా రన్నరప్ గా నిలిచిందని అంటూ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది.

మరిన్ని ప్రసంశలు
ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీ స్ట్రీమింగ్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో అవుతోంది. ఇక కొరియాలో కూడా ఈ సినిమాను కొరియన్ సబ్ టైటిల్స్ తో ఈ మధ్యనే విడుదల చేశారు. ఈ సినిమా రెండో స్థానంలో నిలవడంతో సినిమా మీద మరిన్ని ప్రసంశలు దక్కుతున్నాయి.


Click it and Unblock the Notifications











