రామ్ చరణ్, ఎన్టీఆర్ ట్విట్టర్ వార్.. మధ్యలో చిరంజీవి, రాజమౌళి! మెగా, నందమూరి ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

రామ్ చరణ్, ఎన్టీఆర్ ట్వీట్లతో సామాజిక మాధ్యమం ట్విట్టర్ హోరెత్తిపోతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రుడు రామరాజును సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లుగా ఎన్టీఆర్ ట్విట్టర్‌లో ఓ వీడియో వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాట తప్పిన ఎన్టీఆర్ రాజమౌళి పేరు చెప్పి తప్పించుకున్నారు. దీనిపై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. ఇలా ఈ ఇద్దరి సంభాషణ ట్విట్టర్ వేదికపై నానా హంగామా క్రియేట్ చేస్తోంది. ఆ వివరాలేంటో చూద్దామా..

Recommended Video

#BheemforRamaraju @4PM : NTR, Ram Charan Hilarious Punches In Twitter, Trolls On Rajamouli
చిరంజీవి వెయిటింగ్..

చిరంజీవి వెయిటింగ్..

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా RRR మూవీ నుండి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ రానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఉదయం 10 గంటకు రిలీజ్ చేస్తామని ప్రకటించగా.. ఓ పది పదిహేను నిమిషాలు ఉందనగానే చిరంజీవి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వెయిటింగ్ అంటూ తన ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఇంటర్వెల్ సీన్ పోస్ట్ చేశారు.

నిరాశపర్చిన ఎన్టీఆర్.. నీకు తెలుసుగా అంటూ!

నిరాశపర్చిన ఎన్టీఆర్.. నీకు తెలుసుగా అంటూ!

ఎప్పటికీ మరిచిపోలేని విధంగా రామ్ చరణ్‌కి ఉదయం 10 గంటలకు సర్‌ప్రైజ్ ఉంటుందని ప్రకటించిన ఎన్టీఆర్.. తీరా 10 గంటలు దాటాక ఆ సర్‌ప్రైజ్ ఆలస్యం కానుందంటూ మరో ట్వీట్ చేశారు. ''నన్ను క్షమించు రామ్ చరణ్ బ్రో.. నీకివ్వాల్సిన గిఫ్ట్‌ను నిన్నరాత్రి రాజమౌళి చేతిలో పెట్టాను.. నీకు తెలిసిందే కదా ఆయన చేతిలోకి వెళితే ఎలా ఉంటుందో.. కొంచెం ఆలస్యం అవుతుంది'' అని అందులో పేర్కొన్నారు.

సార్ సార్ అంటూనే చిరంజీవికి రాజమౌళి రిక్వెస్ట్..

సార్ సార్ అంటూనే చిరంజీవికి రాజమౌళి రిక్వెస్ట్..

RRR సర్‌ప్రైజ్ కోసం చిరంజీవి ఎంత ఊపులో ఉన్నాడో చూసి కూడా దానిపై నీళ్లు చల్లేశారు రాజమౌళి. ఉదయం పది గంటలు ఎప్పుడవుతుందా? అని చూసిన చిరంజీవికే చుక్కులు చూపిస్తూ.. సార్ సార్ అంటూ అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ''సార్‌ర్‌ర్.. అంటే అది కొంచెం కొంచెం.. యాక్చువల్‌గా.. ప్లీజ్ సర్'' అంటూ ఆ సర్‌ప్రైజ్ ఆలస్యం కానుందని చెప్పారు.

రామ్ చరణ్ రియాక్షన్.. స్పెషల్ ట్వీట్

ఈ ఇష్యూ అంతా చూస్తున్న రామ్ చరణ్ వెంటనే రియాక్ట్ అవుతూ ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. రాత్రికి రాత్రే నిర్ణయం మారిందని, రామ్ చరణ్‌కు ఇవ్వాల్సిన సర్‌ప్రైజ్ రాజమౌళి చేతికి వెళ్లిందని ఎన్టీఆర్ చెప్పిన మాటలపై స్పందించిన రామ్ చరణ్.. ''ఏంటి..? ఆయనకు పంపావా! అసలు అది ఈ రోజు వస్తుందా?'' అంటూ ఫైర్ అయ్యారు.

మెగా, నందమూరి ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

మెగా, నందమూరి ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

ఈ ట్విట్టర్ సంభాషణలు చూస్తున్న నెటిజన్లకు మాత్రం మంచి ఫన్ దొరికింది. అంతేకాదు ఇంతకీ RRR సర్‌ప్రైజ్ వస్తుందా? రాదా? ఎప్పుడొస్తుంది? అనే ఉత్కంఠ మెగా, నందమూరి అభిమానుల్లో మొదలైంది. ఏదేమైనా చిరంజీవి, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అంతా కలిసి భలే కిక్కిచ్చారులే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X