RRR సస్పెన్స్.. మెగా, నందమూరి అభిమానులకు హ్యాండిచ్చిన రాజమౌళి! సీన్ రిపీట్

టాలీవుడ్ ఘనత, తోలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి. 'బాహుబలి' సినిమాతో యావత్ ప్రపంచాన్నే తెలుగు రాష్ట్రాల వైపు చూసేలా చేసిన జక్కన్న.. మరోసారి అలాంటి భారీ ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. RRR పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన అప్‌డేట్స్ కోసం ఆన్‌లైన్ వేదికలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. కానీ జక్కన్న మాత్రం అవేవీ పట్టించుకోకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.

మెగా, నందమూరి అభిమానుల ఎదురుచూపులు

మెగా, నందమూరి అభిమానుల ఎదురుచూపులు

రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ మూవీ RRRలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం రోల్‌లో నటిస్తున్నాడు. చాలాకాలంగా ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. దీంతో RRR అప్‌డేట్స్ కోసం మెగా, నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

దసరా, దీపావళి అన్నారు.. కానీ

దసరా, దీపావళి అన్నారు.. కానీ

RRR సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా కేవలం ఒకేఒక్క పోస్టర్ రిలీజ్ చేశారు జక్కన్న. ఆ ఒక్క పోస్టర్ తోనే కొండత ప్రమోషన్ చేసుకుంటున్న ఆయన మరే ఇతర అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే ప్రేక్షకుల్లో ఉన్న ఆతృతను బట్టి గతేడాది దసరాకు, దీపావళికి ఈ సినిమా నుంచి సర్‌ప్రైజ్ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు.

 న్యూ ఇయర్ కానుకగా RRR నుంచి..

న్యూ ఇయర్ కానుకగా RRR నుంచి..

షూటింగ్ ప్రారంభించి ఎన్ని నెలలైనా తన సినిమాలకు సంబంధించిన ఎటువంటి విషయాలు బయటకు రాకుండా వాటిపై విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేయడం రాజమౌళికి తెలిసిన గొప్ప మార్కెటింగ్ టెక్నిక్ అని చెప్పుకోవచ్చు. అయితే కానీసం న్యూ ఇయర్ కానుకగా అయినా RRR నుంచి తన అభిమాన హీరోల లుక్స్ వదులుతారని భావించారు మెగా, నందమూరి అభిమానులు.

హ్యాండిచ్చిన రాజమౌళి! మళ్ళీ అదే రిపీట్..

హ్యాండిచ్చిన రాజమౌళి! మళ్ళీ అదే రిపీట్..

కానీ మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు హ్యాండిచ్చారు రాజమౌళి. RRR అనౌన్స్మెంట్ పోస్టర్‌పై సింపుల్‌గా హ్యాపీ న్యూ ఇయర్ 2020 అంటూ విడుదల చేసి మ్యాటర్ క్లోజ్ చేసింది RRR యూనిట్. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మెగా, నందమూరి అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.

ఇంతకీ ఇస్తారా? ఇవ్వరా..?

RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పోషించే పాత్రలు గతంలో ఎన్నడూ చునివి కావడంతో వీరి లుక్స్ పట్ల మరింత హైప్ క్రియేట్ అయింది. మరోవైపు ఈ ఇద్దరికీ సంబంధించిన షూట్స్ కూడా ఫినిష్ అవుతున్నాయి. జులై 30న RRR సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. దీంతో ఇకనైనా వీళ్ళ లుక్స్ పరిచయం చేస్తారా?లేదంటే రిలీజ్ డేట్ సమీపించే వరకూ ఇదే సస్పెన్స్ కొనసాగుతుందా? అనే కోణంలో చర్చలు ముదిరాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X