ట్విట్టర్‌లో హంగామా.. చిరు, రాజమౌళి ట్వీట్స్ వైరల్.. సర్ ప్రైజ్ వచ్చేది ఎప్పుడంటే..?
కరోనా బీభత్సానికి దేశం మొత్తం మూత పడిపోయింది. ఏఫ్రిల్ 14 వరకు దేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉంటుంది. దేశంలోని థియేటర్లన మూసి వేశారు. చాలా మంది వెండితెరపై వినోదాన్ని మిస్ అవుతున్నారు. వెండితెరపై దిగ్గజాలైన చిరంజీవి, రాజమౌళి వంటి వారు సోషల్ మీడియాలో అందరికీ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్‌ను ఇస్తున్నారు. అసలింతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

రామ్ చరణ్ బర్త్ డే కేంద్రంగా..
రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఈ తతంగమంతా మొదలైంది. రామరాజు కోసం భీమ్ అంటూ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్‌ను ప్లాన్ చేశాడు ఎన్టీఆర్. ఈ మేరకు నేటి ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తానని, అది ఎప్పటికీ మరిచిపోలేని విధంగా ఉంటుందని ఊరిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

రాజమౌళి అడ్డం పడటంతో..
అయితే రాత్రి జరిగిన వ్యవహారంతో ఈ గిఫ్ట్ తన నుంచి జారి రాజమౌళి చేతికి వెళ్లిపోయిందని, ఆయన చేతికి చిక్కితే ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. క్షమించు రామ్ చరణ్ అది ఆలస్యం అవుతుందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

చిరంజీవి ఎంట్రీ..
ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్‌లోకి చిరు ఎంట్రీ ఇచ్చాడు. తాను ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను.. వెయిటింగ్ అంటూ తన డైలాగ్‌ను తానే ట్విట్టర్‌లో పోస్ట్ చేసి పది గంటలు ఎప్పుడవుతుందా? అని ఎదురుచూడసాగాడు. అయితే ఇంతలో అది ఆలస్యం కావడంతో రాజమౌళి సంజాయిషీ చెప్పుకున్నాడు.

అది అది అంటూ..
సర్ ప్రైజ్ గిఫ్ట్ ఆలస్యం అవుతుండటంతో.. చిరును బుజ్జగించే ప్రయత్నం చేశాడు రాజమౌళి. సర్ సర్ అది అది కొంచెం కొంచెం.. యాక్చువల్‌గా ప్లీజ్ సర్ అంటూ తడుముకున్నాడు. దానికి రిప్లై ఇచ్చిన చిరు.. అర్థమైంది జక్కన్న గారూ అంటూ సెటైర్ వేశాడు.
Recommended Video

సాయంత్రం నాలుగు గంటలకు..
అయితే తాను రాజమౌళితో చర్చించానని, సాయంత్రం నాలుగు గంటలకు ఆ గిఫ్ట్ కచ్చితంగా వస్తుందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఇలా మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా వినోదాత్మకంగా సాగింది. కరోనా సమయంలో వీరు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్‌లో ఉందని, ట్విట్టర్‌ను ఫుల్లుగా వాడేసుకుంటున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











