RRR దీపావళి స్పెషల్: మెగా, నందమూరి అభిమానుల కోసం జక్కన్న స్పెషల్ ప్లాన్.. గేట్ రెడీ
లాక్ డౌన్ కారణంగా ఈ సారి సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ పడింది. పండగ వేళల్లో హడావుడిగా కనిపించే సినిమా థియేటర్లు జనాలు లేక వెలవెల బోయాయి. అసలైతే ఈ దీపావళికి పెద్ద సినిమా ఒక్కటైనా వచ్చి ఉండేది. లేదంటే స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన ఎదో ఒక సర్ ప్రైజ్ వచ్చి ఉండేది. ఇక RRR నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ వచ్చి ఉండేదో తెలియదు గాని ఇప్పుడు మాత్రం రాజమౌళి అభిమానుల కోసం వేసిన స్పెషల్ ప్లాన్ మాత్రం తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.

హీరోలతో సర్ ప్రైజ్ ప్లాన్
RRR సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే రీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ టీజర్ ని కూడా విడుదల చేసిన దర్శకధీరుడు అంచనాలను అందుకోవడంతో మరోసారి సక్సెస్ అయ్యాడు. ప్రమోషన్స్ డోస్ పెంచడంలో జక్కన్న ఏ విధంగా ఆలోచిస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ దీపావళికి కూడా ఆయన ఇద్దరి హీరోలతో సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.

ట్రెడిషినల్ లుక్ లో కనిపిస్తూ..
RRR లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా రెడీ చేస్తున్న దర్శకధీరుడు మెగా నందమూరి అభిమానులకు కిక్కిచ్చేలా ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు కూడా ట్రెడిషినల్ లుక్ లో కనిపిస్తూ అనేక విషయాలు గురించి చర్చించుకుంటారట.

చరణ్, తారక్ మొదటిసారి..
ఇక సినిమాకు సంబంధించిన విశేషాల గురించి కూడా తప్పకుండా మాట్లాడుకుంటారని ఆభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చూస్తుంటే ఈ దీపావళికి ఇరు వర్గాల అభిమానులకు మరింత స్పెషల్ గా మారనుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతవరకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్రెండ్లిగా ఎలా మాట్లాడుకుంటారో ఎవరు చూడలేదు. అప్పట్లో ప్రెస్ మీట్ లో ప్రశ్నల వరకే సరిపోయింది. ఇక ఈ సారి ఎవరు లేకుండా జక్కన్న ఆధ్వర్యంలో జరుగుతోంది కాబట్టి సరదాగా సాగే ఈ చిట్ చాట్ లో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుందని చెప్పవచ్చు.
Recommended Video

సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
కోవిడ్ డోస్ పెరుగుతున్నా కూడా వెనక్కి తగ్గని RRR టీమ్ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పనుల్లో వేగాన్ని పెంచింది. ఇంకా 30% వరకు షూటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు గాని రాజమౌళి మాత్రం ఇంకా అఫీషియల్ గా వివరణ ఇవ్వలేదు. కానీ వీలైనంత వరకు నెక్స్ట్ ఇయర్ లోనే రిలీజ్ చేయాలని ఒక ఆలోచనకు వచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











