RRR : ఇది కదా అసలు పాన్ ఇండియా అంటే.. రోజు రెండు సిటీలను చుట్టేలా జక్కన్న స్కెచ్!

దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా యూనిట్ శరవేగంగా ప్రమోషన్స్​లో పాల్గొంటోంది. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్​తో గడుపుతోంది. స్పెషల్ ఇంటర్వ్యూలు, మీడియా చిట్​చాట్​లు అంటూ దేశమంతా తిరుగుతుంది. ఒక పక్క ఇవి చేస్తూనే సినిమాకు సంబంధించిన పోస్టర్​, సాంగ్స్​ను విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే అసలు సిసలైన పాన్ ఇండియా సినిమారా ఇదీ అనిపించే విధంగా ఈ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు జక్కన్న. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రతిష్టాత్మకంగా

ప్రతిష్టాత్మకంగా


మరి కొద్దీ పది రోజుల్లో RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటించారు. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ మీద సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను హిందీలో పెన్ స్టూడియోస్, తమిళ్ లో లైకా స్టూడియోస్ విడుదల చేస్తున్నాయి.

వారం రోజుల్లో తొమ్మిది నగరాల్లో

వారం రోజుల్లో తొమ్మిది నగరాల్లో


ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో కేవలం తెలుగు ఫాన్స్ మాత్రమే కాదు ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు ఇంకా పది రోజులే ఉండడంతో రాబోయే ఏడు రోజులను మూవీ టీమ్​​ కీలకంగా తీసుకుంది. 'మారథాన్​ ప్రమోషనల్​ క్యాంపైన్' పేరుతో దేశమంతా చుట్టేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. మార్చి 18 మొదలు ఏకంగా వారం రోజుల్లో తొమ్మిది నగరాల్లో ప్రచారం చేసేలా ప్రణాళికలు రచించింది.

 మార్చి 19న చిక్బల్లాపూర్ లో

మార్చి 19న చిక్బల్లాపూర్ లో


ఇక దానికి సంబంధించిన షెడ్యూల్​ను ఓ ప్రత్యేక వీడియో ద్వారా సినిమా యూనిట్ తమ సోషల్ మీడియాలో షేర్​ చేసింది. వాళ్ళు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం మార్చి 18న హైదరాబాద్ నుంచి దుబాయ్​ వెళ్లి అక్కడ ఈవెంట్లో పాల్గొననుంది. మార్చి 19న బెంగళూరు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేయనున్నారు. అలాగే మార్చి 19న చిక్బల్లాపూర్ లో నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకల్లో చిత్ర బృందం పాల్గొననున్నారు.

మార్చి 23న మళ్లీ తిరిగి హైదరాబాద్

మార్చి 23న మళ్లీ తిరిగి హైదరాబాద్


ఇక ఆ తరువాతి రోజు అంటే మార్చి 20న బరోడా, ఢిల్లీలో జరిగే ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొననున్నారు. మార్చి 21న అమృత్సర్, మార్చి 21న జైపూర్ లో జరిగే ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొననున్నారు. మార్చి 22న కోల్​కతా, వారణాసి పట్టణాల్లో జరిగే ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొననున్నారు. మార్చి 23న మళ్లీ తిరిగి హైదరాబాద్ రానున్న సినిమా యూనిట్ అక్కడ కూడా ఒక ఈవెంట్ జరిపే అవకాశం ఉందని అంటున్నారు.

సినిమా యూనిట్ కు గుడ్ న్యూస్

సినిమా యూనిట్ కు గుడ్ న్యూస్


ఇక ఈ సినిమా విడుదల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా యూనిట్ కు గుడ్ న్యూస్ ఇప్పటికే తెలంగాణలో రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడమే కాక ఐదు షోలు వేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. మరోపక్క ఏపీ కూడా ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఎంత రేటు పెంచుకోవచ్చు అనేది చెబుతామని పేర్కొంది.

Recommended Video

RRR: India's Biggest Pre Release Event At Chikkaballapura | NTR | SS Rajamouli | Filmibeat Telugu

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X