RRR Jr Ntr Teaser: నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమురం భీమ్.. అదరగొట్టిన ఎన్టీఆర్
తెలుగు అభిమానులనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ మూవీ లవర్స్ అందరూ ఎదురుచూస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ RRR. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక లేటెస్ట్ గా వచ్చిన కొమురం బీమ్ టీజర్ కూడా అంచనాల డోస్ ని మరింత పెంచేసింది. దర్శకుడు రాజమౌళి ఆలోచన విధానం ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. టీజర్ ని అరగంట ఆలస్యం చేసి జక్కన్న కాస్త చిరాకు తెప్పించినప్పటికి టీజర్ వచ్చేసరికి ఆ విషయాన్ని మర్చిపోయారు.
Recommended Video

పవర్ఫుల్ టీజర్
ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు రావాల్సిన టీజర్ చాలా ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఎదురుచూపులకు తగిన కనువిందు లభించింది. అల్లూరి సీతారామరాజును జక్కన్న ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రను కూడా అదే స్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. నిన్న విడుదల చేసిన చిన్న క్లిప్పుతోనే అసలు మ్యాటర్ చాలా క్లియర్ గా అర్ధమయ్యింది.

నా తమ్ముడు కొమురం భీమ్
నా తమ్ముడు కొమురం భీమ్ అంటూ రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసిన విధానం నిజంగా నెవర్ బోఫోర్ అనేలా ఉంది. ఇక తారక్ ఫిట్నెస్ రాజమౌళి మేకింగ్ స్టైల్ అంతకు మించి అనేలా ఉంది. అడవులలో తారక్ నిజమైన కొమురం భీమ్ గా దర్శనమివ్వబోతున్నట్లు క్లియర్ గా అర్ధమవుతోంది.
నీరు నిప్పు ఒకటైతే..
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం రాజమౌళి ఎక్కువగా నిప్పు ఫోకస్ అయ్యేలా చేశాడు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర కోసం ఎక్కువగా నీరు ఫోకస్ అయ్యేలా చేశారు. నీరు, నిప్పు ఒకటైతే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ లోనే జక్కన్న హై వోల్టేజ్ సినిమాను రూపొందిస్తున్నట్లు చాలా క్లియర్ గా అర్ధమవుతోంది.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టిన కీరవాణి
ఇక సంగీత దర్శకుడు కీరవాణి మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఎలాంటి సినిమాకైనా తనదైన శైలిలో నేటితరానికి అద్భుతమైన మ్యూజిక్ అందించగల ఈ సంగీత దర్శకుడు ఇద్దరు హీరోల కోసం స్పెషల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేసినట్లు అర్ధమవుతోంది. చుస్టింటే థియేటర్స్ మోత మోగేలా ఉందని అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











