twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోమాలు నిక్కబొడుచుకేలా RRR మోషన్ పోస్టర్.. ఇంతకీ టైటిల్ ఏంటంటే..?

    |

    ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఆర్ఆర్ఆర్ కోసం ఆత్రుతగా ఎదురుచూసే ప్రేక్షకలోకానికి ఆనందాన్ని కలిగించే అప్‌డేట్ వచ్చేసింది. ఇక నుంచి ఆర్ఆర్ఆర్ అంటే ఏమిటని? మెదళ్లను తొలిచే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ ఉగాది పర్వదినాన సినీ ప్రేక్షకులందరికీ రాజమౌళి అదిరిపోయే కానుకనిచ్చాడు. నేడు ఈ మూవీ టైటిల్ లోగో మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు.

    Recommended Video

    #RRRMotionPoster Review | Roudram Ranam Rudhiram | RRR Movie
     ఆర్ఆర్ఆర్ కోసం వేట..

    ఆర్ఆర్ఆర్ కోసం వేట..

    ఆర్ఆర్ఆర్ సినిమా కోసం టైటిల్స్‌ను ఊహించి చెప్పండని, ఎవరైతే మంచి టైటిల్‌ను సూచిస్తారో దాన్నే ఫిక్స్ చేస్తామని సోషల్ మీడియాలో ఓ కాంటెస్ట్‌ను పెట్టింది ఆర్ఆర్ఆర్ టీమ్. కొన్ని వేల టైటిల్స్‌ను సూచించారు నెటిజన్స్. అయితే మొత్తానికి నేడు టైటిల్‌ను ప్రకటించింది యూనిట్.

    అవాంతరాలను దాటుకుంటూ..

    అవాంతరాలను దాటుకుంటూ..

    ఆర్ఆర్ఆర్‌ మొదలైనప్పటి నుంచో ఏదో ఒక రూపంలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. హీరోలకు గాయాలు కావడం, లొకేషన్స్ నుంచి వీడియోలు, స్టిల్స్ లీకవ్వడంలాంటివి జరుగుతూనే ఉన్నాయి.

     వాయిదా పడటంతో షాక్..

    వాయిదా పడటంతో షాక్..

    జూలై 30న ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేస్తామని సినిమా ప్రారంభం నాడు ఘనంగా ప్రకటించారు. అయితే అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోవడంతో సినిమాను వాయిదా వేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టు జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

    ఉగాది కానుకగా..

    అయితే ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వని ఆర్ఆర్ఆర్ టీమ్.. ఉగాది కానుకను అదిరిపోయేలా ప్లాన్ చేశారు. రౌద్రం రణం రుధిరం అంటూ విడుదల చేసిన టైటిల్, మోషన్ పోస్టర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ వేషధారణలు అదిరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఓ రేంజ్‌లోఉంది.

    English summary
    RRR Title Logo And Motion Poster Released. On The Occassion Of Ugadi, DVV Entertainment Released RRR Title. This MovieIs Going To Be Relased On 8th Januray.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X