RRR నుంచి బిగ్ అప్‌డేట్ : ఉగాదికి అదిరిపోయేలా జక్కన్న ప్లాన్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే

తెలుగు సినీ ప్రేక్షకలోకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తరుణం వచ్చేసింది. బాహుబలి వంటి చిత్రాన్ని తెరకెక్కించిన అంతర్జాతీయ వేదికపై భారత్ సత్తాను చాటాడు దర్శకధీరుడు రాజమౌళి. అలాంటి దర్శకుడు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం RRR. ఈ మూవీ కోసం తెలుగు సినీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. ఆ మాటకొస్తే.. కేవలం తెలుగు ప్రేక్షకులే.. కాదు జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

భారీ మల్టీస్టారర్..

భారీ మల్టీస్టారర్..


యంగ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలను పెట్టి తెలుగులోని తెరకెక్కిస్తున్న అత్యంత భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్స్ చేతులు కలపడం ఒకెత్తు అయితే రాజమౌళి తెరకెక్కించడం మరో ఎత్తు.

హాలీవుడ్ బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్..

హాలీవుడ్ బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్..


ఆర్ఆర్ఆర్ చిత్రంలో హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషలకు చెందిన ప్రముఖ నటులున్నారు. కోలీవుడ్ నుంచి విలక్షణ నటుడు సముద్రఖని, బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్, అలియా భట్, హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్, ఇంకా విలన్స్‌గా బ్రిటీష్ అధికారి పాత్రల్లో ఎంతో మంది హాలీవుడ్ దిగ్గజాలను దింపాడు రాజమౌళి.

పలు అవాంతరాలు..

పలు అవాంతరాలు..


ఆర్ఆర్ఆర్ చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి.. ఎన్నో అవాంతరాలు ఎదరువుతూనే ఉన్నాయి. వీడియోలు, ఫోటోలు లీకవ్వడం, హీరోలకు గాయాలవ్వడం, షూటింగ్స్ వాయిదా పడటం ఇలా ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. చివరకు చిత్రమే వాయిదా పడుతున్నట్టు ప్రకటించే పరిస్థితి వచ్చింది. జూలై 30న వస్తుందనుకున్న ఆర్ఆర్ఆర్ జనవరి 8న రాబోతోన్నట్టు అధికారికంగా ప్రకటించారు.

Recommended Video

RRR Motion Poster : Megastar Chiranjeevi, RGV Reacts On RRR Title & RRR Motion Poster

ఉగాది కానుకగా..

రేపు (మార్చి 25) ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో విత్ మోషన్ పోస్టర్‌తో కూడిన టైటిల్ లోగోను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాల భాషలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇరువురి హీరోల అభిమానుల్లో సందడి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X