RRR Trailer Launch: ఎన్టీఆర్ మాటలకు బాలీవుడ్ మీడియా ఫిదా.. రామ్ చరణ్ అందుకే రాలేదు!
పాన్ ఇండియా చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్ తో రూపొందించిన RRR మూవీ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి అనంతరం తెరపైకి తీసుకు వచ్చిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ ఆడియెన్స్ లో కూడా సినిమా ఒక్కసారిగా అంచనాల స్థాయిని పెంచేసింది. అయితే నేడు ముంబై ట్రైలర్ లాంచ్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి, హీరో ఎన్టీఆర్, అజయ్ దేవ్ గన్ , అలియా భట్ మీడియాతో మాట్లాడారు.

కథకు తగ్గట్టుగా..
రాజమౌళి మాట్లాడుతూ.. మరో బాహుబలిని ప్రేక్షకులు ఆశించడం లేదని అంటూ బాహుబలిలో తమకు ఎదురైన అనుభవం కోసం అంతకుమించి అనేలా ఎదురు చూస్తున్నారని అన్నారు. అంచనాల స్థాయి ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. అయితే ప్రేక్షకులు థియేటర్‌లోకి వచ్చిన మరుక్షణమే సినిమా ఎలా ఉంటుందో అర్ధమవుతుంది. ప్రతి ఒక్కరికి ఆశించిన ఎంటర్టైన్మెంట్ దొరుకుందని కథకు తగ్గట్టుగా కనెక్ట్ అవుతారని RRR ప్రెస్ మీట్ లో రాజమౌళి మాట్లాడాడు.

హాలీవుడ్ సినిమాలపై..
ఇక రాజమౌళి హాలీవుడ్ ఆఫర్స్ గురించి మాట్లాడుతూ.. నాకు హాలీవుడ్ నుండి ఎటువంటి ఆఫర్లు రాలేదు. నేను ఇండియన్ సినిమాలు చేయాలనుకుంటున్నాను. కుదిరితే ఇండియన్ కథను తయారు చేసి హాలీవుడ్‌కు ప్రజెంట్ చేస్తాను.. అని ఎస్ఎస్ రాజమౌళి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఇక రాజమౌళి తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.

అజయ్ దేవ్ గన్ మాట్లాడుతూ..
RRRలో తన పాత్రపై అజయ్ దేవ్ గన్ మాట్లాడుతూ.. మన జీవితంలో కొన్ని పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయి. నాకు కొన్ని గుర్తున్నాయి, గతంలో నేను పోషించిన పాత్ర భగత్ సింగ్ పాత్ర నాకు చాలా ఇష్టం. ఇక ఇప్పుడు RRRలోని క్యారెక్టర్ కూడా దాదాపు అలాంటి బలమైన పాత్ర తరహాలో ఉంటుంది. మరికొన్ని నెలలు అదే షూటింగ్ లో ఉంటే నేను కంప్లీట్ గా అందులోనే ఉండేవాడినేమో అని అజయ్ వివరణ ఇచ్చారు.

రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే..
ఇక రామ్ చరణ్ తేజ్ ఈ ఈవెంట్ కు రాకపోవడంపై దర్శకుడు రాజమౌళి క్లారిటి ఇచ్చారు. రామ్ చరణ్ ఒక వివాహ వేడుకకు హాజరు కావాల్సి వచ్చిందని. ఆ విషయం గురించి అందరికి తెలిసిందే. అయితే అతన్ని ఇక్కడికి తీసుకురావడానికి మేము చాలా ప్రయత్నించాము, కానీ అది సాధ్యం కాలేదు.. అని రాజమౌళి తెలియజేశారు.

ఎన్టీఆర్ వివరణ
ఇక జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రాజమౌళి ద్వారా మొదటిసారి హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారి స్పందన గురించి తెలుసుకోవటానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుందని నమ్మకం ఉంది. ఇక అజయ్ దేవ్ గన్ లాంటి సీనియర్ టాలెంటెడ్ హీరోతో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ముందు మేము చిన్న పిల్లలమే. అలాంటి వారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి.. అని జూనియర్ ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు.
Recommended Video

రాబోయే సినిమాలు..
అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తన భవిష్యత్తు సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. RRR సినిమా అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల కానున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ మీడియాకు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











