RRR నుంచి మరో మోషన్ పోస్టర్... ఈ సారి ఎవరిదంటే..

సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR చిత్రం షూటింగ్ దశలోనే అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్లు ఇప్పటికే రికార్డుస్థాయిలో వ్యూస్ సాధించాయి. తాజాగా మరో హీరోకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

ఎన్టీఆర్, రాంచరణ్ తర్వాత ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న అజయ్ దేవగన్ లుక్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 2వ తేదీన అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించింది.

 RRR unit to unveil the Ajay Devgns first look Motion poster on April 2nd

వాస్తవానికి అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్‌ను గతేడాది ఆయన జన్మదినం సందర్భంగా రిలీజ్ చేయాలని ప్రయత్నించారు. కానీ లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఫస్ట్ లుక్ పనులు పూర్తికాలేకపోయాయి. దాంతో ఆ లుక్ రిలీజ్‌ను వాయిదా వేశారు. సవ్యంగా ఈ విషయాన్ని రాజమౌళి ఓ సందర్భంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, సుమారు 400 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న RRR చిత్రం 2021 అక్టోబర్ 13వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X