అటవీ ప్రదేశాల్లో ఎన్టీఆర్.. వారం రోజులుగా అక్కడే.. అదిరిపోయే స్కెచ్ వేసిన రాజమౌళి

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా RRR. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే చిత్రాల్లోని కీలక సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా రాజమౌళి అదిరిపోయే స్కెచ్ వేశారట. వివరాల్లోకి పోతే..

 బాహుబలి తర్వాతి సినిమా కావడంతో..

బాహుబలి తర్వాతి సినిమా కావడంతో..

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో RRR పై ఎన్నో ఆశలు పెట్టుకుంది ప్రేక్షకలోకం. పైగా ఈ చిత్రంలో ఇద్దరు యంగ్ స్టార్ హీరోలు నటిస్తుండటం సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకే అందరి అంచనాలను రీచ్ అయ్యేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని RRR షూట్ చేస్తున్నారట జక్కన్న.

 సరికొత్తగా పాటలు, ఫైట్స్

సరికొత్తగా పాటలు, ఫైట్స్

చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న RRR మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ చిత్రాన్ని ఓ రేంజ్‌లో ఉండేలా రూపొందిస్తున్నారట రాజమౌళి. ఇందులో భాగంగా పాటలు, ఫైట్స్ విషయమై సరికొత్తగా వెళ్తున్నారని తెలిసింది.

వైజాగ్ లోని అటవీ ప్రదేశాల్లో ఎన్టీఆర్..

వైజాగ్ లోని అటవీ ప్రదేశాల్లో ఎన్టీఆర్..

కొద్ది రోజులుగా RRR సినిమా షూటింగ్ విశాఖలోని ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్ ఈ షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లారు. ఆ సమయంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని లుక్స్ లీక్ కావడంతో జక్కన్న సీరియస్ అయ్యారు. అయితే వైజాగ్ లోని అటవీ ప్రదేశాల్లో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారట రాజమౌళి.

గెరిల్లా యుద్దాల షూటింగ్.. వారం రోజులుగా ఎన్టీఆర్

గెరిల్లా యుద్దాల షూటింగ్.. వారం రోజులుగా ఎన్టీఆర్

మన్యం వేదికగా పోడు వ్యవసాయం చేసే తెగల కష్టనష్టాలు, వారిపై నిజాం పాలకులు చేసే అక్రమాలను కొమరం భీం ఎదిరించే సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తున్నారట. ఇందులో భాగంగా నిజాం సైన్యంపై కొమరం భీం చేసే గెరిల్లా యుద్దాల షూటింగ్ జరుగుతోందని సమాచారం. వారం రోజులుగా జరుగుతున్న ఈ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరిందని తెలిసింది.

రామ రౌద్ర రుషితం

రామ రౌద్ర రుషితం

ఇక RRR సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2020 జులై 31న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి 'రామ రౌద్ర రుషితం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X