twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదిరిపోయిన RRR అప్‌డేట్.. ఎన్టీఆర్‌‌కు జోడిగా విదేశీ భామ.. విలన్లుగానూ అక్కడివారే..

    |

    బాహుబలి సినిమాలతో సంచలనం స‌ృష్టించాడు దర్శకధీరుడు రాజమౌళి. టాలీవుడ్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన జక్కన్న.. తన తదుపరి చిత్రాన్ని కూడా అదే రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలతో ఆర్ఆర్ఆర్ అనే మల్టీ స్టారర్‌ను ప్రకటించి టాలీవుడ్‌ను షేక్ చేశాడు. ఈ చిత్రాన్ని కూడా వరల్డ్ వైడ్ ఫేమస్ చేసేందుకు బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులను భాగస్వామ్యం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు జోడీగా విదేశీ భామను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

    విదేశీ భామ తప్పుకోవడంతో తిప్పలు..

    విదేశీ భామ తప్పుకోవడంతో తిప్పలు..

    అయితే సినిమా తొలి ప్రెస్‌ మీట్‌లో ఎన్టీఆర్‌కు జోడిగా.. డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ అనే హాలీవుడ్‌ భామ నటిస్తున్నట్టుగా ప్రకటించాడు మన జక్కన్న. కానీ కొన్ని కారణాల వల్ల డైసీ ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కు సరైన జోడిని వెతికే పనిలో ఉంది రాజమౌళి టీం. ఒకపక్క షూటింగ్ పనులు కానిచ్చేస్తూనే మరో పక్క హీరోయిన్‌ కోసం వేట కొనసాగించింది.

    ఇప్పటికే 70 శాతం పూర్తి..

    ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం వరకు పూర్తయిందని. ఎన్టీఆర్‌ కొమరం భీంగా, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో త్వరలోనే ఓ అప్‌డేట్ ఇస్తామని, అన్ని రూమర్లకు చెక్ పెడతామని ఎన్టీఆర్‌కు జోడిగా నటించబోయేది ఎవరనే విషయాన్ని ప్రకటిస్తామని చిత్రయూనిట్ నిన్న సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

    ఎన్టీఆర్‌కు జోడిగా ఓలివియా మోరీస్‌

    ఫైనల్‌గా ఎన్టీఆర్‌కు సరైన జోడిని వెతికి పట్టుకున్నారు ఆర్ఆర్ఆర్‌ టీం. ఈ రోజు ఆమె ఫోటోతో పాటు క్యారెక్టర్‌ పేరు అధికారికంగా ప్రకటించారు. లండన్‌కు చెందిన ఓలివియా మోరీస్‌ను ఎన్టీఆర్‌కు జోడిగా జెన్నీఫర్‌ పాత్రకు ఫైనల్‌ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌ అయిన ఓలివియా పలు టీవీ షోస్‌లోనూ నటించింది. ఈమె ఆర్‌ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌ సరసన నటించనుంది.

    Recommended Video

    #Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again

    హాలీవుడ్ నటులతో అంతర్జాతీయ దృష్టి..

    విలన్‌గా ఐరిష్ యాక్టర్‌ రే స్టీవెన్సన్‌ నటిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో రే బ్రిటీష్ అధికారి స్కాట్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రఖ్యాత థార్‌ సిరీస్‌లో నటించిన రే స్టీవెన్సన్‌.. పలు టెలివిజన్‌ షోస్‌లో కీలక పాత్రల్లో నటించాడు. తొలిసారిగా ఓ రీజినల్ సినిమాలో నటించేందుకు అంగీకరించాడు రే. అలాగే, ఈ సినిమాలో లేడీ విలన్ కూడా ఉంది. ఆ పాత్ర పేరు లేడీ స్కాట్. ఈ పాత్రలో 53 ఏళ్ల ఐరిష్ నటి అలిసన్ డూడీ నటిస్తున్నారు. ఇప్పటికే పలు హాలీవుడ్ సినిమాలు, టీవీ సిరీస్‌లలో నటించిన అలిసన్.. RRR ద్వారా ఇండియన్ సినిమాకు పరిచయం అవుతున్నారు.

    English summary
    Rajamouli Upcoming Project RRR Movie Updates. Female Lead Beside NTR Is Olivia Morris. Ray Stevenson, Alison Doody Are Playing Negetive Roles In RRR. THis Movie Is Releasing On 30th July 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X