twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: ఆశతో అడ్వాన్స్ బూకింగ్స్ చేసుకొన్నళ్ల పరిస్థితి ఏంటి.. ఆ డబ్బు ఇక రానట్లే?

    |

    ప్రేక్షకుల్లో ఎంతగానో అంచనాలను క్రియేట్ చేసిన RRR మూవీ మొదటి రోజు మొదటి షో చూడాలి అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు అయితే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా సినిమా వాయిదా పడటంతో అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది.

    వాయిదాల పర్వం..

    వాయిదాల పర్వం..

    సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా RRR సినిమా చాలా దగ్గరగా వచ్చినట్లే వచ్చి వెంటనే మాయమైపోయింది. ఇప్పటికీ ఆ సినిమా వాయిదా పడడం ఇది ఐదవసారి. మొదట్లో రాజమౌళి కారణంగా షూటింగ్ పనులు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయ్యాయి అంటూ రెండు సార్లు వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా దెబ్బతో మూడు సార్లు డేట్ మార్చాల్సి వచ్చింది.

    అడ్వాన్స్ బూకింగ్స్

    అడ్వాన్స్ బూకింగ్స్

    ఏదేమైనా కూడా RRR సినిమా ప్రేక్షకులను ఎంతో ఆశకి గురి చేసి చివరికి నిరాశను మిగిల్చింది. ఈ సినిమా వాయిదా పడుతుంది అని కొందరు ముందుగానే ఊహించి నప్పటికీ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవగానే ఒకసారి ఎగబడి కొనుగోలు చేశారు. టికెట్ ధరలు ఎంత ఉన్నాయి అని కూడా చూడకుండా చాలా ఖర్చు చేసి మరి ఫ్యామిలీ కోసం టికెట్లు బుక్ చేసిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.

    భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

    భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

    గతంలో ఎప్పుడూ లేని విధంగా కేవలం అడ్వాన్స్ బూకింగ్స్ తోనే యూఎస్ లో RRR సినిమా వన్ మిలియన్ డాలర్స్ ను అందుకుని ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమలలో ఇదొక సంచలన రికార్డు. గతంలో ఏ ఇండియన్ సినిమా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆ స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు. సినిమాకు పెరుగుతున్న హైప్ ను దృష్టిలో ఉంచుకొని చిత్రయూనిట్ సభ్యులు కూడా ఒక్కో తరహాలో ధరల నిర్ణయించారు. అత్యధికంగా మూడు వందల డాలర్లకు కూడా టికెట్ అమ్మినట్లు తెలుస్తోంది.

    వాళ్ళ పరిస్తేతేంటి..?

    వాళ్ళ పరిస్తేతేంటి..?

    అయితే సినిమా వాయిదా పడడంతో టికెట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏమిటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే USAలోని ప్రేక్షకులు టోటల్‌లో అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్న టికెట్ ధరలతో కన్వీనియన్స్ ఫీజులు చెల్లించె అవకాశం లేదట. ఆ లెక్కలో మొత్తంగా దాదాపు ₹1 కోటి కన్వీనియన్స్ ఫీజును కోల్పోయారని తెలుస్తోంది. టిక్కెట్ ధర రీఫండ్‌లు మాత్రం ప్రాసెస్ చేయబడుతున్నాయని సమాచారం.

    మళ్ళీ విడుదల ఎప్పుడంటే?

    మళ్ళీ విడుదల ఎప్పుడంటే?

    ఇక RRR సినిమాను మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా మళ్లీ ఏప్రిల్ నెలలోనే విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆ నెలలో కూడా మహేష్ బాబు సర్కారు వారి పాట, విజయ్ భీస్ట్, సినిమా కేజిఎఫ్ చాప్టర్ 2 వంటి బిగ్ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. మరి ఆ రేసులో రాజమౌళి ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచిస్తారో చూడాలి.

    English summary
    RRR Usa who booked in advance convince fees not refundable..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X