సైంధవ్ తండ్రీకూతుళ్ల కథే కాదట.. అది కూడా ఉందట.. సీక్రెట్ రివీల్ చేసిన రుహానీ శర్మ!
విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం సైంధవ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కథతో అందరి ముందుకు వచ్చేందుకు సిద్ధం అయిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా.. విశేష స్పందన వస్తోంది. అలాగే ఈ చిత్రంలోని బుజ్జికొండవే పాటు కూడా అందరినీ తెగ అలరించింది. కంటనీరు వచ్చేలా చేసింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించారు. ఈక్రమంలోనే హీరోయిన్ రుహానీ శర్మ మాట్లాడుతూ.. సినిమా గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమా వెంకటేష్ కు 75వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తో పాటు మరో హీరోయిన్ రుహానీ శర్మ కూడా వచ్చారు. బేబీ సారా, వెంకటేషన్, నవాజుద్దిన్ సిద్ధిఖీ ఇలా ఇతర నటీనటులు కూడా పాల్గొన్నారు. ఇక స్టేజీ మీదకు వచ్చిన రుహానీ శర్మ షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శైలేష్ కొలనుకు థాంక్స్ చెప్పింది. అలాగే తనతో పాటు సినిమాలో నటించిన అందరితో తనకు చాలా మంచి బాండింగ్ ఏర్పడిందని.. జీవితాంతం వారితో రిలేషన్ కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.
అలాగే వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టం అని.. అక్కడే ప్రీరిలీజ్ ఈవెంట్ జరగడం మరింత సంతోషాన్ని ఇస్తుందని రుహానీ శర్మ వెల్లడించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన శ్రద్ధా శ్రీనాథ్ తనకు సిస్టర్ అవుతుందని.. సినిమా షూటింగ్ లో కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చక్కగా కలిసిపోయామని.. అందరూ అదే విధంగా తనతో కలివిడిగా ఉన్నారని చెప్పుకొచ్చింది. తాను సినిమాలో నటించేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పింది.

ముఖ్యంగా సైంధవ్ సినిమా అనేది కేవలం తండ్రీ, కూతుళ్ల కథ మాత్రమే కాదని.. ఇందులో అన్ని రకాల ఎమోషన్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. సినిమా చూస్తున్నంత సేపు ఫుల్ ఎమోషనల్ అవుతారని.. అన్ని ఎమోషన్లు కలగలిపిన ఈ చిత్రాన్ని చూసి థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారని వివరించింది. సినిమా చాలా చక్కగా కుదిరిందని.. కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. చూడాలి మరి జనవరి 13వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందనేది.


Click it and Unblock the Notifications











