56 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్‌తో డేటింగ్.. పెళ్లికి ముందే బ్రేకప్.. అసలేం జరిగిందంటే?

రుక్కు రుక్కు రక్కిమీని.. రమని సుగుణమణి రబ్బా హాయ్ రబ్బా... ఈ పాట తెలియని వారు, సినిమాలో ఈ పాటను పాడుతూ కనిపించిన పృథ్వీరాజ్ తెలియని వారు ఇండియాలో లేరంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన సినిమాలతో వచ్చి అందిరనీ అలరించిన ఈయన.. పెళ్లి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టారు. మొదటి సినిమాలో విలన్ గా కనిపించి మెస్మరైజ్ చేశారు. ఉత్తమ విలన్ అవార్డును అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు.

అయితే ప్రస్తుతం 56 ఏళ్ల వయసు కల్గిన ఈ సక్సెస్ ఫుల్ హీరో.. ఓ కుర్ర హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు. భార్యతో గొడవలు రాగా మరో అమ్మాయికి దగ్గర అయిన ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. ఇద్దరూ కలిసి డేటింగ్ కూడా చేశారు. అయితే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. కానీ తాజాగా ఆ కుర్ర హీరోయిన్ షాక్ ఇచ్చింది. పృథ్వీరాజ్ కు తాను బ్రేకప్ చెప్పినట్లు వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Rukmini Sheetal Said She Broke Up With Actor Babloo Prithveeraj Check Details

పృథ్వీరాజ్ 1994లో తొలిసారి బీనాను వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి ప్రేమకు ప్రతీకలుగా ఓ బాబు పుట్టాడు. అతడికి అహద్ మెహన్ జబ్బర్ అనే పేరు పెట్టుకుని అపురూపంగా పెంచుకున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా హాయిగా సాగిన వీరి కాపుంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో పృథ్వీరాజ్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. 6 సంవత్సరాలు వేర్వేరుగా జీవించిన వీరు.. ఆ తర్వాత న్యాయబద్ధంగా విడిపాయారు. అంటే విడాకులు తీసుకున్నారు.

ఇక ఆ తర్వాత ఒంటరిగా ఉన్న పృథ్వీరాజ్.. నటి రుక్మిణీ శీతల్ కు దగ్గరయ్యారు. 26 ఏళ్ల వయసు కల్గిన ఈ తెలుగు అమ్మాయితో డేటింగ్ కూడా చేశాడు. ఏడాది కూడా కాకముందే వీరిద్దరూ దూరం అయ్యారు. అయితే ఈమెను పృథ్వీరాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. చాలా ఇంటర్వ్యూల్లో వీరు కూడా కనిపించి పెళ్లి అయినట్లు చెప్పారు. కానీ తాజాగా శీతల్ ఓ ట్విస్ట్ ఇచ్చింది.

Rukmini Sheetal Said She Broke Up With Actor Babloo Prithveeraj Check Details

తాను పృథ్వీరాజ్ ను రెండో పెళ్లి చేసుకోలేదని.. కానీ ఇద్దరూ ప్రేమించుకోవడంతో డేటింగ్ మాత్రమే చేసినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తామిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు వెల్లడించింది. అలా దూరం అయిన తాము వేర్వేరుగా ఉంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వీరిద్దరి బ్రేకప్ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా అంత చిన్న పిల్లతో డేటింగ్ చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సరే.. ఇద్దరూ ఎవరి జీవితాల్లో వారు హ్యాపీగా ఉండంటి అంటూ చెప్పుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X