Rashmika Deepfake Video అలాంటి చేదు అనుభవం రష్మికకే కాదు.. యువ హీరోయిన్లు షాకింగ్ కామెంట్స్
సప్త సాగరాలు దాటి సైడ్ ఎ మూవీకి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత వస్తున్న సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ మరియు చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలలో నటించారు. నవంబర్ 17న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి రుక్మిణి, చైత్ర మాట్లాడుతూ..
సప్త సాగరాలు దాటి సైడ్ బీ మూవీలో నా పాత్ర గురించి చెప్పడం కష్టం. చాలా కాంప్లికేటేడ్ పాత్రను పోషించాను. బలమైన, స్వతంత్ర భావాలు ఉన్న మహిళ పాత్రను పోషిస్తున్నాను. ప్రియా, మను క్యారెక్టర్లు అప్పటికే ప్రేమలో ఉంటారు. వారి మధ్యలోకి వచ్చే పాత్ర నాది. నా పాత్ర బలమైనది. సినిమాను మలుపు తిప్పే రోల్ చేశాను. సురభీ పాత్ర ద్వారా మీకు చేరువ అవుతాననే నమ్మకం ఉంది.

సప్త సాగరాలు దాటి సైడ్ బీ మూవీలోని సురభీ కారెక్టర్ ద్వారా యాక్టర్‌గా నిరూపించుకొనే అవకాశం లభించింది. ప్రియా, మను మధ్య జరిగే డ్రామాలో నా పాత్ర ఏమిటనేది చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించడం ఆనందంగా ఉంది అని చైత్ర తెలిపారు.
రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై చైత్ర స్పందిస్తూ.. అలా చేయడం చాలా తప్పు. ఓ పోస్టు పెట్టి తప్పు అని చెప్పడం చాలా ఈజీ. దానికి మమ్మల్ని ట్రోల్ చేసి కామెంట్ చేస్తారు. అయితే ఓ చిన్నపాపకు జరిగితే..ఓ అమ్మాయికి అలాంటి చేదు అనుభవం ఎదురైతే.. ఏమౌతుందో ఆలోచించండి. ఇలాంటి వాటిపై ప్రజలే సరైన చర్యలు తీసుకోవాలి. అలాటి వారిని కఠినంగా శిక్షించాలి అని చైత్ర అన్నారు.
ఇక రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. అలాంటి వీడియోలు క్రియేట్ చేయడం చాలా తప్పు. అన్ని రకాలుగా ఖండించాల్సిన విషయం. యాక్టర్లు ఇలాంటి వారికి మొదటగా బాధితుల అవుతారు. అలాంటి యాప్స్‌ను బ్యాన్ చేయాలి. యాక్టర్లు కాకుండా సాధారణ యువతులకు జరిగితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అన్నారు.


Click it and Unblock the Notifications











