Rules Ranjan Trailer Review సన్నీలియోన్ భర్త నాకు స్పూర్తి.. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ ట్రైలర్ ఎలా ఉందంటే?

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రూల్స్ రంజన్. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'రూల్స్ రంజన్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన 'నాలో నేనే లేను', 'సమ్మోహనుడా', 'ఎందుకురా బాబు' పాటలు ఒక దానికి మించి ఒకటి అన్నట్లుగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే?

ప్రతీ తండ్రి నన్ను చూసి నేర్చుకోవాలి. ప్రతీ తల్లి పాలిచ్చి పెంచుతుంది. కానీ నేను ఆల్కహాల్ ఇచ్చి ఓదార్చుతాను. నీకు ఏం కావాలి కొడుకా? అంటే.. నాకు బీరు కావాలి అంటూ కిరణ్ చెప్పడం ఫన్నీగా కనిపించింది. ఇక నాకంటూ రూల్స్ ఉంటాయి అని కిరణ్ అంటే.. మార్క్ వెబర్స్ మీద ఒట్టు అని వెన్నెల కిషోర్ సమాధానం ఇస్తాడు. దాంతో వాడెవడూ అంటే సన్నీలియోన్ భర్త. నాకు చాలా ఆదర్శం అంటూ వెన్నెల కిషోర్ కామెంట్ చేస్తాడు.

హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్షను చూసి మీకు పెళ్లిందా అంటే.. అవునని వాళ్లు సమాధానం చెబుతారు. అయితే వాళ్లకు కడుపులు రాకుండా మీకు కడుపులు ఎందుకు వచ్చాయి అంటూ కిరణ్ సెటైర్ వేస్తాడు. అలాంటి సింపులు, ఫన్, హ్యూమర్‌తో చాలా అంశాలు ట్రైలర్‌లో కనిపించాయి.

Rules Ranjan Trailer Review: Kiran Abbavaram, Neha Sshetty comedy timing hillarious

ఇక నేహాశెట్టి, కిరణ్ అబ్బవరి మధ్య కెమిస్ట్రీ, ఫన్ మూమెంట్స్ బాగా ఉన్నాయి. నేహా శెట్టి గురించి మాట్లాడుతూ.. అప్పుడెప్పుడూ నాసా పంపిన రాకెట్‌లా అమ్మాయి మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి వచ్చిందా? అంటూ వెన్నెల కిషోర్ అంటాడు. కిరణ్‌తో నీకు ముంబై బాగా తెలుసా? అంటే.. గూగుల్ మ్యాప్‌కు తెలియని విధంగా నాకు తెలుసు అంటాడు. దాంతో నీవు ట్రావెల్ గైడ్‌వా? అంటూ కిరణ్‌కు నేహా పంచ్ విసురుతుంది.

Rules Ranjan Trailer Review: Kiran Abbavaram, Neha Sshetty comedy timing hillarious

పార్టీ చేసుకొందామా? అని నేహా అడిగితే.. పద చాట్ తిందాం అని కిరణ్ అంటాడు. పబ్‌కు ఎప్పుడూ వెళ్లలేదా? అని నేహా అంటే.. వీకెండ్స్ వస్తే.. నన్ను రూల్స్ రంజన్ అనరు. పబ్ రంజన్ అంటారు అని కిరణ్ ఫోజు కొట్టేస్తాడు. ఆ తర్వాత నేహా, కిరణ్ పెగ్గుల మీద పెగ్గులేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. దాంతో రంజన్ ఎందుకు పబ్ రంజన్ అయ్యాడు అనే ప్రశ్న మరో వ్యక్తి వేస్తాడు.

Rules Ranjan Trailer Review: Kiran Abbavaram, Neha Sshetty comedy timing hillarious

కిరణ్‌తో ఓ అమ్మాయి మాట్లాడుతూ.. నీకు వన్ హవర్ కూడా సరిపోదా? అయితే.. కామేష్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేసి రేపు రా అని వెన్నెల కిషోర్‌తో అంటుంది. వాడు రోజంతా చేస్తాడా? వాడు ఆఫ్టరాల్ జీడిపప్పు ఉప్మా తినేవాడు అని నరేష్ అంటాడు. దాంతో గంట లేదు. అర్ధ గంట లేదు. ఇద్దరు బయటకు పోండి అంటూ రూల్స్ రంజన్ విసురుకొంటాడు. ఈ సినిమా ట్రైలర్‌లో నేహా శెట్టితో లవ్ ట్రాక్, హైపర్ ఆది, వెన్నెల కిషోర్‌తో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సినిమా సరదాగా సరదాగానే కాకుండా ఎమోషన్ డ్రైవ్ ఉంటుందని స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X