twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి రూమర్స్ ఆపేయండి.. అలా రాసేవారిపై డైరెక్టర్ సెటైర్

    |

    వచ్చిన ప్రతీ రూమర్ నిజం కాకపోవచ్చు గానీ.. అందులో ఎంతో కొంత నిజమైతే ఉండితీరుతుంది. అయితే కొన్ని రూమర్స్ వట్టి గాలిమాటలే.. వాటికి ఆధారాలే ఉండవు. అలాంటి వాటిని సెలెబ్రిటీలు ఖండిస్తారు.. ఖండించాలి కూడా. తాజాగా తమ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ తెగ వైరల్ అవుతుండటంతో నిర్మాతలు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తమ సినిమా అప్‌డేట్‌ను ప్రకటించారు. అసలు ఆ సినిమా ఏంటి? నిర్మాతలు ఎవరు? అన్న విషయాలు ఓ సారి చూద్దాం.

    అవసరాల-నాగశౌర్య కాంబినేషన్‌లో..

    అవసరాల-నాగశౌర్య కాంబినేషన్‌లో..

    ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే. ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, జో అచ్యుతానంద వంటి క్లాస్ చిత్రాలు వచ్చాయి. తాజాగా మరో విభిన్న ప్రేమకథా చిత్రం రాబోతోంది.

    వివిద దశల్లోని ప్రేమకథ..

    వివిద దశల్లోని ప్రేమకథ..

    నా ఆటోగ్రాఫ్, మళ్లీరావా వంటి చిత్రాల మాదిరిగా ఉండే ఓ ప్రేమ కథను తాను చేస్తున్నట్టు అశ్వథ్థామ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇందులోని ప్రేమకథ కొత్తగా ఉంటుందని.. దాదాపు సగం పార్ట్ కంప్లీట్ అయిందని అమెరికా షెడ్యూల్ చాలా పెద్దదని తెలిపాడు.

    ఆగిపోయినట్టు రూమర్స్..

    ఆగిపోయినట్టు రూమర్స్..

    అయితే ఈ సినిమా ఆగిపోయినట్టు వార్తలు రావడంతో నిర్మాతలు వివేక్ కూచిభొట్ల అలర్ట్ అయ్యారు. తమ సినిమా యాభై శాతం షూట్ పూర్తి చేసుకుందని, వీసా కారణంగా ఆలస్యం అవుతుందని, అమెరికా షెడ్యూల్ బ్యాలెన్స్ ఉందని అధికారికంగా ప్రకటించారు. పరోక్షంగా అలాంటి రూమర్స్ ఆపేయండని చెప్పినట్టుంది.

    Recommended Video

    Naga Shaurya Emotional On Stage | Aswathama Trailer | Aswathama Pre Release Event | Filmibeat Telugu

    సెటైర్ వేసిన నందినీ రెడ్డి..

    నిర్మాతలు చేసిన ఆ ట్వీట్‌కు నందినీ రెడ్డి స్పందించింది. ‘ఓకే ఈ రూమర్ క్లియర్ అయిపోయింది.. తరువాత ఇంకెలాంటివి క్రియేట్ చేస్తారో చేయండి.. నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నా'నంటూ సెటైరికల్‌గా స్పందించింది. గతంలోనూ ఇలాగే.. తన సినిమాపై వచ్చిన రూమర్లపైనా కౌంటర్ వేసింది.

    English summary
    Rumors On Naga Shaurya Srinivas Avasarala Movie. Naga Shaurya Srinivas Avasarala New Movie Get sDelay Because of Visa Problem.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X