‘సాహో’ రిలీజ్‌పై రూమర్లు... అసలు నిజం ఇదే?

'సాహో' మూవీ విడుదల కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు చేదు వార్త.. ఈ చిత్రం ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్టు 15న విడుదల కావడం లేదు.. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం అంటూ ఇంటర్నెట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన రూమర్స్ ప్రకారం.. 'సాహో' ఆగస్టు 30న విడుదల చేయాలని నిర్ణయించారట. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా పెండింగులో ఉంది. చివరి నిమిషయంలో అనవసర టెన్షన్స్ పడకుండా స్మూత్‌గా సినిమా రిలీజ్ చేద్దామనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

అసలు నిజం ఇదే

అసలు నిజం ఇదే

ఆగస్టు 15 అనేది కాసులు వర్షం కురిపించే డేట్. వీకెండ్‌కు రిపబ్లిక్ డే హాలిడే కూడా కలిసి వస్తుంది. అయితే.... మరో నెల రోజుల్లోపే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషనల్ ఈవెంట్స్ పూర్తి చేయడం కష్టమైన పరిస్థితుల్లో నిర్మాతలు మరో ఆప్షన్‌గా ఆగస్టు 30 అనుకున్నారట. అయితే దీనిపై అధికారికంగా ప్రకటించలేదు. కానీ అంతలోపే మీడియాలో రూమర్లు రావడంతో చిత్ర బృందం విస్మయానికి గురైంది. రిలీజ్ వాయిదా వేసే అవకాశం దాదాపుగా ఉండబోదని ఫిల్మ్ యూనిట్ స్పష్టం చేసింది.

అఫీషియల్‌గా ప్రకటించలేదు

అఫీషియల్‌గా ప్రకటించలేదు

‘సాహో' విడుదల వాయిదా గురించి నిర్మాతల నుంచి ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. మరి ఇందులో నిజం ఎంత? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఒక వేళ ఇదే నిజమైతే ఆగస్టు 15న విడుదల కాబోతున్న ‘మిషన్ మంగళ్', ‘బాట్లా హౌస్' నిర్మాతలు సంతోష పడటం ఖాయం.

గ్రాండ్‌గా ప్రమోషన్స్

గ్రాండ్‌గా ప్రమోషన్స్

‘సాహో' మూవీ నాలుగు భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కనీవినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలు అన్నీ తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సాహో

సాహో

‘సాహో' చిత్రాన్ని సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ వారు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎవలీన్ శర్మ లాంటి బాలీవుడ్ తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన యాక్షన్ సినిమాలు అన్నింటినీ మించి పోయేలా ఈ చిత్రం ఉంటుందట. అబుదాబిలో చిత్రీకరించిన 8 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం రూ. 70 కోట్ల ఖర్చు పెట్టారంటే సినిమా ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X